07 May 2024
ఆ బ్యూటీకి క్యూ కడుతున్న టాలీవుడ్ ఆఫర్స్.. అంతా కియారా నామమే..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక చిత్రాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న హీరోయిన్లలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఒకరు.
మొదట్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ చేసి ప్రతిభతో మెప్పించి ఇప్పుడు టాప్ హీరోయిన్గా మారింది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీ.
మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత రామ్ చరణ్ జోడిగా వినయ విధేయ రామ సినిమాలో కనిపించింది. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా హిట్ కాలేదు.
ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ షిప్ట్ అయ్యింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తుంది.
డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో మరోసారి సౌత్ ఇండస్ట్రీలో హిట్ అందుకోబోతుంది.
ఇవే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్ 2, డాన్ 3 చిత్రాల్లో నటిస్తుంది. పెళ్లైన తర్వాత కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో డామినేషన్ కొనసాగిస్తుంది.
అటు హిందీ.. ఇటు తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉన్న కియారాకు టాలీవుడ్ నుంచి మరికొన్ని క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట.
ఇక్కడ క్లిక్ చేయండి.