అలియా ధరించిన ఈ చీరను తయారుచేయడానికి అన్ని రోజులు పట్టాయా?

TV9 Telugu

07 May 2024

బాలీవుడ్ అందాల తారల సొగసులు, ఫ్యాషన్ మెరుపులతో గ్లోబల్ ఫ్యాషన్‌ షో మెట్‌ గాలా  చూపరులకు కనుల విందు నిచ్చింది.

ముఖ్యంగా  అలియా భట్ ఈ ఫ్యాషన్ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  ప్రత్యేకంగా రూపొందించిన శారీలో కనిపించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

ఈ ఫ్యాషన్ వెంట్‌లో అలియా ధరించిన చీరకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ముఖ్యంగా మెట్‌ గాలా లో అలియా భట్  ధరించిన చీర ఫ్యాషన్ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. అయితే దీని వెనక ఓ పెద్ద కథ ఉందండోయ్.

అలియా భట్ ధరించిన ఈ షిమ్మరీ శారీని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ రూపొందించారు. గార్డెన్ ఆఫ్ టైమ్ అనే థీమ్‌కు సరిపోయేలా ఈ గ్రీన్ శారీని డిజైన్ చేశారు.

అయితే ఈ స్పెషల్ డిజైనర్ శారీ కోసం ఏకంగా దాదాపు 1965 గంటలు అంటే దాదాపు 80 రోజులు పట్టిందని డిజైనర్ వెల్లడించారు.

అంతేకాదు ఆలియా భట్ చీరను రూపొందించేందుకు ఏకంగా  163 మంది హస్తకళాకారులు అవిశ్రాంతంగా పనిచేసినట్లు డిజైనర్ పేర్కొన్నారు.

మనదేశ మూలాలను ప్రపంచ వేదికపై చాటి చెప్పేందుకు ప్రత్యేక పర్యవేక్షనలో ఇటలీలో ఈ చీరను రూపొందించారని డిజైనర్ వెల్లడించాడు.