Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meenakshi Thapa: తోటి నటులే హీరోయిన్‌ను చంపి.. తల నరికిన దారుణ ఘటన..!

Meenakshi Thapa: తోటి నటులే హీరోయిన్‌ను చంపి.. తల నరికిన దారుణ ఘటన..!

Anil kumar poka

|

Updated on: May 07, 2024 | 10:37 PM

నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో ఆశలతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారుతున్న క్రమంలోనే ఊహించిన ఘటన ఆమె జీవితానికి ముగింపు పలికింది. తోటి కళాకారులే షూటింగ్ సెట్ నుంచి ఆ నటిని కడ్నాప్ చేసి.. గొంతు కోసి.. ఆపై తల నరికి చంపడం 2012లో సంచలనంగా మారింది. బాలీవుడ్‌ను ఉలిక్కిపడేలా చేసింది. ఆ నటి పేరు మీనాక్షి థాపా.

నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో ఆశలతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారుతున్న క్రమంలోనే ఊహించిన ఘటన ఆమె జీవితానికి ముగింపు పలికింది. తోటి కళాకారులే షూటింగ్ సెట్ నుంచి ఆ నటిని కడ్నాప్ చేసి.. గొంతు కోసి.. ఆపై తల నరికి చంపడం 2012లో సంచలనంగా మారింది. బాలీవుడ్‌ను ఉలిక్కిపడేలా చేసింది. ఆ నటి పేరు మీనాక్షి థాపా. 1984 అక్టోబర్ 4న నేపాల్‌లో జన్మించి డెహ్రాడూన్‌లో పెరిగింది. చదువుకుంటున్న సమయంలోనే నటనపై ఆసక్తితో ముంబైకి చేరుకుంది. ముంబైలో డ్యాన్స్ శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. 2011లో 404 సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ మూవీ తర్వాత ఆమెకు మధుర్ భండార్కర్ తెరకెక్కించిన హీరోయిన్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో కరీనా కపూర్ మెయిన్ లీడ్ అయితే ఈమె సెకండ్‌ లీడ్. అలాంటి కెరీర్ టర్నింగ్ సినిమా షూటింగ్ జరగుతుండగానే.. ఓరోజు షూటింగ్ సెట్ నుంచి కిడ్నాప్ కు గురైంది.

కట్ చేస్తే.. మీనాక్షి తన తల్లికి ఫోన్ చేసి తన సహనటుడు, స్నేహితుడు అమిత్ కుమార్ జైస్వాల్, ప్రీతి సూరిన్ లతో కలిసి అలహాబాద్ వెళ్తునట్లు ఫోన్లో చెప్పింది. రెండు రోజులు గడిచినా ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ తర్వాత ఆమె తల్లికి తెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. మీ అమ్మాయి క్షేమంగా ఉండాలంటే 15 లక్షలు ఇవ్వాలని.. పోలీసులకు చెబితే తమ కూతురి అసభ్యకర వీడియోలను బయటపెడతామని బెదిరంచారు. దీంతో పోలీసులను ఆశ్రయించగా.. ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. మీనాక్షిని ఆమె ఇద్దరు స్నేహితులు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అలహాబాద్ లో ఆమెను బంధించి దారుణంగా హింసించారు. కొన్నాళ్లకు అమిత్, ప్రీతి సూరిన్ లను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా.. మీనాక్షి హత్యోందంత వెలుగులోకి వచ్చింది. 15 లక్షలు చెల్లించిన తర్వాత వారు మీనాక్షి గొంతు కోసి హత్య చేసి.. ఆ తర్వాత ఆమె తల నరికి ముంబైకి తిరిగి వచ్చే దారిలో బస్సు కిటికిలో నుంచి బయట పడేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. మీనాక్షి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసిన వాటర్ ట్యాంక్ లో పడేశారు. అయితే మీనాక్షి తలను కానీ.. ఆమె బాడీని కానీ పోలీసులు కనిపెట్టలేకపోయారు. 2018లో అన్ని విచారణలు జరిగిన తర్వాత కోర్టు వారిద్దరికి జీవితఖైదు శిక్ష విధించింది. ఇలా నటి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.