ఎస్‌బీఐ న్యూ రూల్స్.. ఇకపై ఏటీఎం నుంచి లక్ష విత్ డ్రా చేయొచ్చు!
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన కస్టమర్లకు శుభవార్త అందించింది. ఎప్పటికప్పుడు వివిధ రకాల సేవలతో జనాలను ఆకర్షించే ఎస్‌బీఐ తాజాగా ఏటీఎం క్యాష్ విత్‌డ్రా సేవల్లో అనేక మార్పులు తెచ్చింది. ఇకపై డెబిట్ కార్డు ప్రాతిపదికన రోజుకు రూ.20,000 నుంచి రూ. లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా నెలకు 8 నుంచి 10 వరకు ఉచితంగా ఏటీఎం ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకోవచ్చని ఎస్‌బీఐ తన కస్టమర్లకు సూచించింది. ఒకవేళ ఈ […]
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన కస్టమర్లకు శుభవార్త అందించింది. ఎప్పటికప్పుడు వివిధ రకాల సేవలతో జనాలను ఆకర్షించే ఎస్‌బీఐ తాజాగా ఏటీఎం క్యాష్ విత్‌డ్రా సేవల్లో అనేక మార్పులు తెచ్చింది. ఇకపై డెబిట్ కార్డు ప్రాతిపదికన రోజుకు రూ.20,000 నుంచి రూ. లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా నెలకు 8 నుంచి 10 వరకు ఉచితంగా ఏటీఎం ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకోవచ్చని ఎస్‌బీఐ తన కస్టమర్లకు సూచించింది. ఒకవేళ ఈ ఉచిత పరిమితిని దాటితే బ్యాంకు కస్టమర్ల నుంచి చార్జీలు వసూల్ చేస్తుంది.
మరోవైపు అక్టోబర్ 1నుంచి బ్యాంక్ సర్వీస్ చార్జీలను కూడా ఎస్‌బీఐ సవరించింది. అకౌంట్‌లో కావాల్సినంత డబ్బులు లేకుండా ఏటీఎం ట్రాన్సాక్షన్ జరిగినా కూడా పెనాల్టీ చెల్లించక తప్పదని స్పష్టం చేసింది. కాగా, వివిధ ఎస్‌బీఐ ఏటీఎం కార్డులపైన క్యాష్ విత్ డ్రా లిమిట్స్ ఇలా ఉన్నాయి…
ఎస్‌బీఐ క్లాసిక్ అండ్ మ్యాస్ట్రో డెబిట్ కార్డు:
ఈ కార్డులు ఉపయోగించేవారు రోజుకు రూ.20,000 విత్ డ్రా చేయొచ్చు. అంతేకాక ఈ కార్డును చాలామంది ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఎస్‌బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు:
ఈ కార్డు ఉన్నవారు రోజుకు రూ.40,000 విత్ డ్రా చేసుకోవచ్చు. అంతేకాక ఈ కార్డు ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా మీ అకౌంట్‌ను యాక్సస్ చేయొచ్చు.
ఎస్‌బీఐ మై కార్డు ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు:
ఈ కార్డు ద్వారా రోజుకు రూ.40,000 ఏటీఎం నుంచి తీసుకోవచ్చు. ఈ కార్డు ద్వారా ఎక్కువ ఆన్లైన్ పేమెంట్స్ చేస్తుంటారు.
ఎస్‌బీఐ ఇన్టచ్ ట్యాప్ అండ్ గో డెబిట్ కార్డు:
ఎస్‌బీఐ ఇన్టచ్ ట్యాప్ అండ్ గో డెబిట్ కార్డుతో రోజుకు రూ.40 వేలు క్యాష్ ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. అంతేకాక ఈ కార్డు చాలా సెక్యూర్‌గా ఉంటుంది.
ఎస్‌బీఐ సిల్వర్ అండ్ గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్స్:
ఈ రెండు డెబిట్ కార్డ్స్ ద్వారా రూ.40,000 నుంచి రూ.50,000 వరకు ఏటీఎం నుంచి తీసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఆన్లైన్ పేమెంట్స్‌కు, డబ్బు విత్ డ్రాకు ఈ కార్డులను ఉపయోగించవచ్చు.
ఎస్‌బీఐ ప్లాటినమ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్:
ఎస్‌బీఐ ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డుతో రోజుకు ఏకంగా రూ.లక్ష విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ కార్డును అన్ని రకాలుగా కూడా ఉపయోగించవచ్చు.