AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేబుల్ టీవీ యూజర్లకు గుడ్ న్యూస్.. 150 ఛానెల్స్ ఇకపై రూ.130కే..

దసరా పండుగ సందర్భంగా కేబుల్ టీవీ యూజర్లు శుభవార్త. ఇకపై 150 ఛానెల్స్‌ను కేవలం రూ.130కే వీక్షించవచ్చు. జనాలకు మరింత చేరువ కావడానికి కేబుల్ టీవీ ప్రొవైడర్ల అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కేబుల్ టీవీ ప్రొవైడర్లు నెట్వర్క్ కెపాసిటీ ఫీజ్ కింద రూ.130ను వసూల్ చేస్తున్నారు. ఇకపోతే ఆల్ ఇండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్(ఏఐడిసిఎఫ్) ఇండియాలోని 80 శాతం కేబుల్ యూజర్లకు సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. దీని సభ్యులైన హాత్‌వే డిజిటల్, ఇన్‌డిజిటల్, […]

కేబుల్ టీవీ యూజర్లకు గుడ్ న్యూస్.. 150 ఛానెల్స్ ఇకపై రూ.130కే..
Ravi Kiran
|

Updated on: Oct 06, 2019 | 12:46 PM

Share

దసరా పండుగ సందర్భంగా కేబుల్ టీవీ యూజర్లు శుభవార్త. ఇకపై 150 ఛానెల్స్‌ను కేవలం రూ.130కే వీక్షించవచ్చు. జనాలకు మరింత చేరువ కావడానికి కేబుల్ టీవీ ప్రొవైడర్ల అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కేబుల్ టీవీ ప్రొవైడర్లు నెట్వర్క్ కెపాసిటీ ఫీజ్ కింద రూ.130ను వసూల్ చేస్తున్నారు. ఇకపోతే ఆల్ ఇండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్(ఏఐడిసిఎఫ్) ఇండియాలోని 80 శాతం కేబుల్ యూజర్లకు సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. దీని సభ్యులైన హాత్‌వే డిజిటల్, ఇన్‌డిజిటల్, సిటీ నెట్వర్క్స్, జీటీపీఎల్ హాత్‌వే, ఫాస్ట్‌వే ట్రాన్స్‌మిషన్, డీఈఎన్ నెట్వర్క్స్, యూసీఎన్ కేబుల్, ఆర్టెల్ కమ్యూనికేషన్స్, ఐసీఎన్‌సీఎల్, ఏషియానెట్ డిజిటల్, కేరళ కమ్యూనికేటర్స్ కేబుల్ ఇటీవల చర్చలు జరిపి రూ.130కే 150 ఎస్‌డీ ఛానెల్స్‌ను యూజర్లకు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ విషయాన్ని AIDCF అధ్యక్షుడు ఎస్ఎన్ శర్మ స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయానికి ట్రాయ్ అనుమతి ఉందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

మరోవైపు ట్రాయ్ రూ.130కు 100 ఛానెల్స్‌ను ప్రొవైడ్ చేయాలని షరతులు విధించిన సంగతి తెలిసిందే. ఇందులో అన్ని రకాల ఫ్రీ ఛానెల్స్‌తో పాటుగా పెయిడ్ ఛానళ్ళు కూడా ఉంటాయి. ఇక 150 ఛానెల్స్ కావాలంటే రూ.40 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కానీ రూ.130 కేబుల్ బిల్లుకే ఏకంగా 150 ఛానెళ్లు ఇచ్చేందుకు డిజిటల్ మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్‌కు అనుబంధంగా పనిచేస్తున్న ఆల్ ఇండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్ నిర్ణయించింది. అంతేకాక ట్రాయ్ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత 25% యూజర్లు కేబుల్ నుంచి డీటీహెచ్ సర్వీసుల వైపు మారారు. మరి ఇప్పుడు కేబుల్ ప్రొవైడర్ల కొత్త నిర్ణయం వారికి ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.