అజారుద్దీన్ తనయుడితో అనమ్ మీర్జా నిఖా.. కన్ఫర్మ్ చేసిన సానియా

టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కుమారుడు అసద్(25), ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సోదరి అనమ్ మీర్జా(28) రిలేషన్‌లో ఉన్నారని.. త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని.. అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని సానియా మీర్జా కన్ఫర్మ్ చేసింది. డిసెంబర్‌లో ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు సానియా తెలిపింది. పారిస్‌లో బ్యాచులర్ పార్టీని పూర్తి చేసుకొని వచ్చిన వెంటనే వీరిద్దరి వివాహం ఉండబోతుందని ఆమె పేర్కొంది. కాగా అనమ్‌కు 2016లో అక్బర్ […]

అజారుద్దీన్ తనయుడితో అనమ్ మీర్జా నిఖా.. కన్ఫర్మ్ చేసిన సానియా
Follow us

| Edited By:

Updated on: Oct 07, 2019 | 3:37 PM

టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కుమారుడు అసద్(25), ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సోదరి అనమ్ మీర్జా(28) రిలేషన్‌లో ఉన్నారని.. త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని.. అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని సానియా మీర్జా కన్ఫర్మ్ చేసింది. డిసెంబర్‌లో ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు సానియా తెలిపింది. పారిస్‌లో బ్యాచులర్ పార్టీని పూర్తి చేసుకొని వచ్చిన వెంటనే వీరిద్దరి వివాహం ఉండబోతుందని ఆమె పేర్కొంది.

కాగా అనమ్‌కు 2016లో అక్బర్ రషీద్‌తో వివాహం జరిగింది. ఆ తరువాత కొన్ని కారణాల వలన గతేడాది ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి తన ఫ్యాషన్‌ కెరీర్‌ మీదే దృష్టిపెట్టిన అనమ్ గత కొంతకాలంగా అసద్‌తో రిలేషన్‌లో ఉంది. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ.. ఇదివరకు పలుమార్లు సోషల్ మీడియాలో ఫొటోలను పోస్ట్ చేశారు. అలాగే అసద్ సైతం అనమ్‌తో తీసుకున్న ఓ ఫొటోకు ఫ్యామిలీ అనే కామెంట్ పెట్టాడు. ఇదిలా ఉంటే అసద్ ప్రస్తుతం బడ్డింగ్ లాయర్‌గా పనిచేస్తున్నాడు.

https://www.instagram.com/p/BuTcJUbHaPv/

https://www.instagram.com/p/BugaSqlA22Q/

https://www.instagram.com/p/Bt8jEhnAi1L/