ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!
పీఎస్‌యూల్లో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణకు మార్గాన్ని సుగమం చేస్తూ మోదీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశంలో 5 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)తో సహా షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ పబ్లిక్ సోషల్ ఎంటర్‌ప్రైజెస్‌లలో ఉన్న ప్రభుత్వ వాటాల విక్రయాన్ని కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదించింది. దీనితో బీపీసీఎల్‌లో 53.2% ప్రభుత్వ వాటాను ఉపసంహరించుకోవడానికి […]
పీఎస్‌యూల్లో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణకు మార్గాన్ని సుగమం చేస్తూ మోదీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశంలో 5 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు.
భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)తో సహా షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ పబ్లిక్ సోషల్ ఎంటర్‌ప్రైజెస్‌లలో ఉన్న ప్రభుత్వ వాటాల విక్రయాన్ని కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదించింది. దీనితో బీపీసీఎల్‌లో 53.2% ప్రభుత్వ వాటాను ఉపసంహరించుకోవడానికి సుగమం కాగా.. ఎస్‌సీఐ(53.75%), సీఓఎన్‌సీఐఆర్(30.8%) సంస్థలలో వాటాల అమ్మకానికి సంబంధించిన ప్రతిపాదనను కూడా ఆమోదించారు.
అంతేకాకుండా టిహెచ్‌డీసీ ఇండియా(74.34%), నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లోని 100 శాతం వాటాలను కూడా అమ్మాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాను 51 శాతానికి తగ్గించుకోవాలని కూడా కేబినెట్ నిర్ణయించినట్లు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.