వైఎస్ వివేకా హత్య కేసు.. ఈ నెల 20కి విచారణ వాయిదా!

వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకు అప్పగించడంలో జగన్ సర్కార్ విముఖత వ్యక్తం చేస్తోంది. ఈ కేసు విచారణ తుది దశలో ఉందని ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలపగా.. వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ నెల 20కి విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణ ముగిసే వరకు తుది నివేదికను స్థానిక కోర్టులో దాఖలు చేయవద్దని సిట్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే ఈ కేసుకు సంబంధించి వివేకా […]

వైఎస్ వివేకా హత్య కేసు.. ఈ నెల 20కి విచారణ వాయిదా!
Follow us

|

Updated on: Jan 08, 2020 | 3:48 PM

వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకు అప్పగించడంలో జగన్ సర్కార్ విముఖత వ్యక్తం చేస్తోంది. ఈ కేసు విచారణ తుది దశలో ఉందని ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలపగా.. వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ నెల 20కి విచారణను వాయిదా వేసింది.

తదుపరి విచారణ ముగిసే వరకు తుది నివేదికను స్థానిక కోర్టులో దాఖలు చేయవద్దని సిట్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే ఈ కేసుకు సంబంధించి వివేకా భార్య సౌభాగ్యమ్మ వేసిన అనుబంధ పిటిషన్‌పై ఈ నెల 19లోగా కౌంటర్లు దాఖలు చేయాలనీ ఏజీకి కోర్టు స్పష్టం చేసింది.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు  సుమారు 1400 మందిని సిట్ విచారించింది. అందులో భాగంగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని కూడా విచారించిన సంగతి తెలిసిందే.