AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇంగ్లండ్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్‌ వదిలేసి సినిమాల్లోకి.. ఇప్పుడు టాలీవుడ్‌లో తిరుగులేని హీరో.. ఎవరంటే?

భోపాల్ లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత పుణెలో ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంజినీర్ గా చేశాడు. ఆపై ఇంగ్లండ్ కు వెళ్లి అక్కడ కూడా ఓ ఐటీ కంపెనీలో జాబ్ చేశాడు. కానీ నటనపై ఆసక్తి ఉండడంతో అన్నిటినీ వదిలేసి మళ్లీ ఇండియాకు వచ్చాడు.

Tollywood: ఇంగ్లండ్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్‌ వదిలేసి సినిమాల్లోకి.. ఇప్పుడు టాలీవుడ్‌లో తిరుగులేని హీరో.. ఎవరంటే?
Naveen Polishetty
Basha Shek
|

Updated on: Jan 13, 2026 | 3:05 PM

Share

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు, హీరోయిన్లు ఒకప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వారే. మరీ ముఖ్యంగా చాలా మంది విదేశాల్లోసాఫ్ట్ వేర్ జాబులు చేసిన వారే. కానీ నటనపై ఇంట్రెస్ట్ తో లక్షల జీతాలు వచ్చే జాబులను సైతం వదిలిపెట్టి సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. హీరోలుగా, డైరెక్టర్లుగా, సహాయక నటులుగా సత్తా చాటుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాలీవుడ్ హీరో కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. ఇతను ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాడు. ఇంట్లో ఇంజినీరింగ్, ఐఐటీలు చదివిన వారు ఎక్కువగా ఉండడంతో ఇతను మంచిగా చదువుకున్నాడు. ఆర్బీలో ఎంప్లాయ్ కావాలని కలలు కన్నాడు. అయితే ఇతనికి చిన్నప్పటి నుంచే ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆసక్తి. స్కూల్ లో స్టేజ్ షోలు, నాటకాలు వేశాడు. హైదరాబాద్ రేడియో సిటీ 91.1 FM నిర్వహించిన ఆర్ జే హంట్ కాంటెస్ట్ లోనూ విజేతగా నిలిచాడు. అలాగనీ చదువులో అసలు తగ్గలేదు. భోపాల్ లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ వెంటనే పుణెలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా చేరాడు. ఆ పై ఇంగ్లండ్ కు వెళ్లి అక్కడ ఓ ప్రముఖ టెలికాం సంస్థలో ఐటీ జాబ్ చేశాడు. కానీ నటనపై ఆసక్తి ఉండడంతో అన్నిటినీ వదిలేశాడు. లక్షల జీతమొచ్చే జాబ్ కు రాజీనామా చేసి ఇండియాకు వచ్చాడు.

ముంబైకు వచ్చిన ఇతను చిన్న చిన్న పనులు చేశాడు. చిన్న చిన్న ఈవెంట్లకు హోస్ట్ గా చేశాడు. స్టాండప్ కమెడియన్ గా ఆకట్టుకున్నాడు. ఇదే క్రమంలో నటునిగా అవకాశాలు తెచ్చుకున్నాడు. ఆపై హీరోగానూ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు తెలుగులో తిరుగులేని హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇంతకీ అతనెవరనుకుంటున్నారా? మన జాతి రత్నం నవీన్ పొలిశెట్టి.

ఇవి కూడా చదవండి

అనగనగా ఒక రాజు సినిమాలో నవీన్ పొలిశెట్టి..

నవీన్ నటించిన లేటెస్ట్ సినిమా అనగనగా ఒక రాజు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా బుధవారం (జనవరి 14) న ప్రేక్షకుల ముందుకు రానుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా యాక్ట్ చేసింది. సినిమా నేపథ్యంలో నవీన్ పొలిశెట్టికి సంబంధించిన పలు ఆసక్తకర విషయాలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఒకప్పుడు ఇంగ్లండ్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. ఇప్పుడు టాలీవుడ్ హీరో
ఒకప్పుడు ఇంగ్లండ్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. ఇప్పుడు టాలీవుడ్ హీరో
మనిషిలా నడిచే చెట్టు! ప్రకృతి అద్భుతంతో ఆశ్చర్యంలో శాస్త్రవేత్తలు
మనిషిలా నడిచే చెట్టు! ప్రకృతి అద్భుతంతో ఆశ్చర్యంలో శాస్త్రవేత్తలు
మంచోడని రూ.15 లక్షల కట్నం.. 10 తులాల బంగారం ఇచ్చి పెళ్లి చేశారు..
మంచోడని రూ.15 లక్షల కట్నం.. 10 తులాల బంగారం ఇచ్చి పెళ్లి చేశారు..
కలలో వెంటాడిన ముగ్గురు మహిళలు.. మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్లిన
కలలో వెంటాడిన ముగ్గురు మహిళలు.. మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్లిన
ఆ ఇద్దరు హీరోలే నాకు ఆదర్శం..
ఆ ఇద్దరు హీరోలే నాకు ఆదర్శం..
హెల్ప్ కోసం బాలకృష్ణకు మెసేజ్ చేస్తే.. నాతో ఆయన ఫోన్ చేసి..
హెల్ప్ కోసం బాలకృష్ణకు మెసేజ్ చేస్తే.. నాతో ఆయన ఫోన్ చేసి..
మళ్లీ థియేటర్లలోకి 'పుష్ప 2'.. ప్రమోషన్స్‌లో బన్నీ ఫ్యామిలీ
మళ్లీ థియేటర్లలోకి 'పుష్ప 2'.. ప్రమోషన్స్‌లో బన్నీ ఫ్యామిలీ
రాఖీ మూవీలో ఆ క్యారెక్టర్ చేసినందుకు ఇంటికి వచ్చి మరీ..
రాఖీ మూవీలో ఆ క్యారెక్టర్ చేసినందుకు ఇంటికి వచ్చి మరీ..
డిమార్ట్‌లో సరుకుల రేట్స్ ఎందుకు అంత తక్కువగా ఉంటాయి?
డిమార్ట్‌లో సరుకుల రేట్స్ ఎందుకు అంత తక్కువగా ఉంటాయి?
చనిపోయిందనుకున్న అమ్మాయి.. ఆరు నెలలకు ప్రత్యక్షం..!
చనిపోయిందనుకున్న అమ్మాయి.. ఆరు నెలలకు ప్రత్యక్షం..!