AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిరులు కురిపిస్తోన్న ఘాటు మిర్చి..ఇదే కొనసాగితే ‘రైతే రాజు’

ప్రతి ఏడాది గిట్టుబాటు ధరలేక మిర్చి రైతులు పడే బాధలు వర్ణణాతీతం. పంట రోడ్డుపైనే తగలుబెట్టిన దాఖలాలు కోకొల్లలు. కానీ ఈ ఏడాది మిర్చి పంట రైతులకు లక్ష్మీదేవిగా మారింది. సిరుల వర్షం కురిపిస్తోంది.  రైతులు ఇది ఖచ్చితంగా కలే అనుకుంటారు. గత రెండు దశాబ్దాలలో ఎప్పుడు లేనంత రికార్డు ధరకు మిర్చి ధర చేరుకుంది. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్ మిర్చి రూ.23 వేల వరకు పలుకుతోంది. ఖమ్మం, వరంగల్ మార్కెట్ యార్డుల్లో రైతుల మోముల్లో ఆనందం […]

సిరులు కురిపిస్తోన్న ఘాటు మిర్చి..ఇదే కొనసాగితే 'రైతే రాజు'
Ram Naramaneni
|

Updated on: Jan 08, 2020 | 3:50 PM

Share

ప్రతి ఏడాది గిట్టుబాటు ధరలేక మిర్చి రైతులు పడే బాధలు వర్ణణాతీతం. పంట రోడ్డుపైనే తగలుబెట్టిన దాఖలాలు కోకొల్లలు. కానీ ఈ ఏడాది మిర్చి పంట రైతులకు లక్ష్మీదేవిగా మారింది. సిరుల వర్షం కురిపిస్తోంది.  రైతులు ఇది ఖచ్చితంగా కలే అనుకుంటారు. గత రెండు దశాబ్దాలలో ఎప్పుడు లేనంత రికార్డు ధరకు మిర్చి ధర చేరుకుంది. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్ మిర్చి రూ.23 వేల వరకు పలుకుతోంది. ఖమ్మం, వరంగల్ మార్కెట్ యార్డుల్లో రైతుల మోముల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. చైనా, మలేషియా, థాయ్‌లాండ్‌ దేశాల నుంచి భారీ స్థాయిలో డిమాండ్ రావడంతో ధర రోజురోజుకు పెరిగిపోతోంది. గతేడాది వరకు వ్యవసాయం అంత ఆశాజనకంగా లేదు. కానీ భూముని వదిలి రైతు బ్రతకలేడు. అందుకే కష్టమైనా, నష్టమైనా..నేలను దున్నకుంటూ సాగిపోతున్నాడు. ఎంత కష్టం చేసినాా, స్వేదం చిదించినా..ఏడాది చివరికి మిగిలేది అప్పులే. కానీ ఈ సంవత్సరం అదృష్టం కలిసొచ్చి వాణిజ్య పంటలైన మిర్చి, ప్రత్తి వంటివి అత్యధిక ధరలు పలుకుతున్నాయి.

ఒక ఏడాది మంచి ధర ఉంటే..దిగుబడి సరిగ్గా ఉండదు. మరో ఏడాది పంట బాగా పండితే..రేటు దక్కదు. గత ఏడాది మిర్చి క్వింటాల్ ధర రూ 4, 500 నుంచి రూ 8,000 వరకు పలికింది. కానీ ఈ ఏడాది దిగుబడితో..రేటు కూడా మంచి రైజ్‌లో ఉంది. తాలు మిరపకాయలు కొనేందుకు కూడా వ్యాపారులు ఎగబడుతున్నారంటే పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో అర్దం చేసుకోవచ్చు. అత్యధికంగా తేజం రకం మిర్చి ధర రూ. 20 వేలు దాటి రూ. 25 వేల వైపు పరిగెడుతుంది. మిర్చి అధికంగా పండించే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో గతేడాది అక్టోబర్ మాసంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అక్కడ దిగుబడి తగ్గింది. ఆ ప్రభావంతో ప్రస్తుతం మిర్చి రేట్లు ఆకాశాన్నంటాయి.

వామ్మో.. షుగర్ వల్ల దేశంలో ఇన్ని లక్షల కోట్ల నష్టమా.. డాక్టర్లు..
వామ్మో.. షుగర్ వల్ల దేశంలో ఇన్ని లక్షల కోట్ల నష్టమా.. డాక్టర్లు..
హోంగార్డ్ సర్వీసుల్లోకి ట్రాన్స్ జెండర్స్.. నియామక పత్రాలు అందజేత
హోంగార్డ్ సర్వీసుల్లోకి ట్రాన్స్ జెండర్స్.. నియామక పత్రాలు అందజేత
ప్రపంచంలోనే అత్యంత వింతైన బీచ్..వెలుగులోకి 150 ఏళ్ల నాటి మిస్టరీ!
ప్రపంచంలోనే అత్యంత వింతైన బీచ్..వెలుగులోకి 150 ఏళ్ల నాటి మిస్టరీ!
కూలీ పనులు చేస్తూ కూడా లక్షాధికారి కావచ్చు.. అద్భుతమైన ఐడియా
కూలీ పనులు చేస్తూ కూడా లక్షాధికారి కావచ్చు.. అద్భుతమైన ఐడియా
అనిల్ రావిపూడి ఫస్ట్ మూవీ పటాస్‌ను రిజెక్ట్ చేసిన హీరో ఎవరంటే?
అనిల్ రావిపూడి ఫస్ట్ మూవీ పటాస్‌ను రిజెక్ట్ చేసిన హీరో ఎవరంటే?
గిల్ సేనకు దిమ్మతిరిగే షాక్.. రాజకోట్‌లో ఓటమి ఫిక్స్
గిల్ సేనకు దిమ్మతిరిగే షాక్.. రాజకోట్‌లో ఓటమి ఫిక్స్
శంఖు పూలు.. సాగు చేశారో లక్షల ఆదాయం!
శంఖు పూలు.. సాగు చేశారో లక్షల ఆదాయం!
మీ ఫోన్‌ను తరచుగా ఫ్యాక్టరీ రీసెట్ చేస్తారా? అప్పుడే అసలు సమస్య
మీ ఫోన్‌ను తరచుగా ఫ్యాక్టరీ రీసెట్ చేస్తారా? అప్పుడే అసలు సమస్య
7 ఏళ్లుగా టీమిండియాకు దూరం.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా రీఎంట్రీ
7 ఏళ్లుగా టీమిండియాకు దూరం.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా రీఎంట్రీ
మార్షల్‌ ఆర్ట్స్ జర్నీ... పవన్‌ కల్యాణ్‌కి అరుదైన గుర్తింపు
మార్షల్‌ ఆర్ట్స్ జర్నీ... పవన్‌ కల్యాణ్‌కి అరుదైన గుర్తింపు