IND vs NZ 2nd ODI: గిల్ సేనకు దిమ్మతిరిగే షాక్.. రాజకోట్‌లో ఓటమి ఫిక్స్.. ఆ లెక్కలు చూస్తే ఫుల్ పరేషానే..!
IND vs NZ 2nd ODI: రాజకోట్ గడ్డపై ఉన్న బ్యాడ్ రికార్డును చెరిపివేసి, సిరీస్‌ను ఇక్కడే ముగించాలని గిల్ సేన పట్టుదలతో ఉంది. బ్యాటర్లకు సహకరించే ఈ పిచ్‌పై టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

IND vs NZ 2nd ODI: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్‌కు రాజకోట్‌లోని నిరంజన్ షా స్టేడియం (పాత పేరు సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం) సిద్ధమైంది. తొలి వన్డేలో 301 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఉత్సాహంగా ఉన్న శుభ్‌మన్ గిల్ సేనను ఇప్పుడు ‘రాజకోట్ రికార్డులు’ కలవరపెడుతున్నాయి. ఈ మైదానంలో టీమ్ ఇండియా గణంకాలు అంత ఆశాజనకంగా లేవు. 2020 తర్వాత ఇక్కడ ఆడిన వన్డేల్లో భారత్‌కు ఒక్క విజయం కూడా దక్కకపోవడం గమనార్హం.
గణాంకాలు ఏం చెబుతున్నాయి? (Rajkot ODI Stats)..
రాజకోట్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అమితంగా సహకరిస్తుంది. ఇక్కడ పరుగుల వరద పారడం ఖాయం. కానీ, ఈ పరుగుల వేటలో భారత్ పలుమార్లు తడబడింది.
మొత్తం వన్డేలు: ఈ మైదానంలో భారత్ ఇప్పటివరకు 4 వన్డేలు ఆడింది.
భారత్ విజయాలు: కేవలం ఒకటి మాత్రమే (2020లో ఆస్ట్రేలియాపై).
ఓటములు: 3 మ్యాచ్‌ల్లో భారత్ పరాజయం పాలైంది.
చివరి విజయం: జనవరి 17, 2020న ఆస్ట్రేలియాపై 36 పరుగుల తేడాతో గెలిచింది. ఆ తర్వాత ఇక్కడ జరిగిన అంతర్జాతీయ వన్డేల్లో భారత్‌కు కలిసి రాలేదు.
2020 తర్వాత నిరాశే..
2020లో ఆస్ట్రేలియాపై గెలిచిన తర్వాత, 2023లో మళ్ళీ అదే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. ఇక్కడ జరిగిన గత మూడు మ్యాచ్‌లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. రాజకోట్ పిచ్‌పై 300+ పరుగులు చేయడం సులభమే అయినా, రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని ఛేదించడం ఒత్తిడితో కూడుకున్న పనిగా మారుతోంది.
కివీస్ సిరీస్‌లో కీలక మలుపు..
ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. రాజకోట్‌లో గెలిస్తే సిరీస్ భారత్ వశమవుతుంది. అయితే, న్యూజిలాండ్ జట్టు కూడా తక్కువ అంచనా వేయలేం. తొలి వన్డేలో కివీస్ ఓపెనర్లు కాన్వే, నికోల్స్ అద్భుత ప్రదర్శన చేశారు. మరోవైపు, విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించేందుకు కోహ్లీకి కేవలం ఒక్క పరుగు మాత్రమే అవసరం.
జట్టుకు పెద్ద దెబ్బ: వాషింగ్టన్ సుందర్ దూరం..
ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానంలో యువ ఆటగాడు ఆయుష్ బదోనికి అవకాశం దక్కవచ్చు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ వంటి సీనియర్లపై ఇప్పుడు అదనపు బాధ్యత పడనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




