AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: 7 ఏళ్లుగా టీమిండియాకు దూరం.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా రీఎంట్రీతో కళ్లు చెదిరే రికార్డ్..!

Ishant Sharma Captaincy Comeback: విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఢిల్లీ క్రికెట్ జట్టుకు ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ నాయకత్వం వహించాడు. 2019 తర్వాత అతను ఒక జట్టుకు నాయకత్వం వహించడం ఇదే మొదటిసారి. ఇషాంత్ శర్మ చివరిగా ఏ మ్యాచ్‌కు నాయకత్వం వహించాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Team India: 7 ఏళ్లుగా టీమిండియాకు దూరం.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా రీఎంట్రీతో కళ్లు చెదిరే రికార్డ్..!
Ishant Sharma Captaincy Comeback
Venkata Chari
|

Updated on: Jan 13, 2026 | 4:24 PM

Share

Ishant Sharma Captaincy Comeback: భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ దేశవాళీ క్రికెట్‌లో తన అనుభవాన్ని మరోసారి చాటుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ నాలుగో క్వార్టర్ ఫైనల్‌లో విదర్భతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టుకు ఇషాంత్ శర్మ నాయకత్వం వహించాడు. దాదాపు 7 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన ఒక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం.

టీమ్ ఇండియా వన్డే జట్టులోకి ఎంపికైన రిషబ్ పంత్, శిక్షణలో గాయపడటంతో పాటు వైస్ కెప్టెన్ ఆయుష్ బదోని కూడా జాతీయ జట్టు పిలుపు అందుకోవడంతో, మేనేజ్‌మెంట్ అనుభవజ్ఞుడైన ఇషాంత్ శర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది.

మైలురాయిని చేరుకున్న ఇషాంత్: 200వ లిస్ట్-ఏ వికెట్..

ఈ మ్యాచ్ ఇషాంత్ శర్మకు వ్యక్తిగతంగా కూడా చాలా ప్రత్యేకం. విదర్భ ఓపెనర్ అథర్వ తైడేను అవుట్ చేయడం ద్వారా ఇషాంత్ శర్మ లిస్ట్-ఏ క్రికెట్‌లో తన 200వ వికెట్ మార్కును చేరుకున్నాడు. తన 142వ లిస్ట్-ఏ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన ఇషాంత్, ఇందులో 115 వికెట్లను భారత్ తరపున వన్డే ఇంటర్నేషనల్స్ (ODI)లో సాధించాడు. మిగిలిన వికెట్లు వివిధ దేశవాళీ టోర్నమెంట్లలో నమోదు చేశాడు.

ఇవి కూడా చదవండి

చివరిసారిగా 2018/19 సీజన్‌లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ జట్టును నడిపించిన ఇషాంత్, ఇప్పుడు మళ్ళీ తన కెప్టెన్సీ మ్యాజిక్‌ను ప్రదర్శించాడు.

విదర్భ పోరాటం.. ఢిల్లీ బౌలర్ల ధాటి..

బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్‌లో జరిగిన ఈ కీలక పోరులో టాస్ గెలిచిన ఇషాంత్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

విదర్భ ఇన్నింగ్స్: యశ్ రాథోడ్ (86 పరుగులు), అథర్వ తైడే (62 పరుగులు) రాణించడంతో విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది.

ఢిల్లీ బౌలింగ్: ఇషాంత్ శర్మ 10 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టారు. నవదీప్ సైనీ, ప్రిన్స్ యాదవ్ మరియు నితీష్ రాణాలు కూడా తలా రెండు వికెట్లతో రాణించారు.

37 ఏళ్ల వయసులోనూ అదే పదునైన బౌలింగ్‌తో దూసుకుపోతున్న ఇషాంత్ శర్మ, త్వరలో జరగనున్న ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున బరిలోకి దిగనున్నాడు. ఈ దేశవాళీ ప్రదర్శన అతనికి ఐపీఎల్‌కు ముందు మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

7 ఏళ్లుగా టీమిండియాకు దూరం.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా రీఎంట్రీ
7 ఏళ్లుగా టీమిండియాకు దూరం.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా రీఎంట్రీ
మార్షల్‌ ఆర్ట్స్ జర్నీ... పవన్‌ కల్యాణ్‌కి అరుదైన గుర్తింపు
మార్షల్‌ ఆర్ట్స్ జర్నీ... పవన్‌ కల్యాణ్‌కి అరుదైన గుర్తింపు
షురూ అయిన సంక్రాంతి సందడి... వరుస కట్టిన సినిమాలు!
షురూ అయిన సంక్రాంతి సందడి... వరుస కట్టిన సినిమాలు!
కాస్ట్‌లీ మేకప్‌ కిట్స్‌ వద్దు.. ఈ సింపుల్‌ టిప్స్‌తో ఇంట్లోనే..
కాస్ట్‌లీ మేకప్‌ కిట్స్‌ వద్దు.. ఈ సింపుల్‌ టిప్స్‌తో ఇంట్లోనే..
యశ్ 'టాక్సిక్‌' సినిమాకు మరో బిగ్ షాక్.. .. సెన్సార్ బోర్డుకు లేఖ
యశ్ 'టాక్సిక్‌' సినిమాకు మరో బిగ్ షాక్.. .. సెన్సార్ బోర్డుకు లేఖ
ఈ చెక్క బెరడు సకల రోగ నివారిణి.. శ్వాసకోశ సమస్యలకు దివ్యౌషధం..!
ఈ చెక్క బెరడు సకల రోగ నివారిణి.. శ్వాసకోశ సమస్యలకు దివ్యౌషధం..!
మీ ఫోన్ పోయిందా.. 30 నిమిషాల్లో ఈ పని చేయకపోతే మీరు ఎంత..
మీ ఫోన్ పోయిందా.. 30 నిమిషాల్లో ఈ పని చేయకపోతే మీరు ఎంత..
మనవళ్ల ఆటల పోటీలకు ఫిదా అయిన సీఎం చంద్రబాబు దంపతులు..
మనవళ్ల ఆటల పోటీలకు ఫిదా అయిన సీఎం చంద్రబాబు దంపతులు..
BSNL: చౌకైన ప్లాన్‌లతో ఏడాది పాటు వ్యాలిడిటీ.. అద్భుతమైన ప్లాన్స్
BSNL: చౌకైన ప్లాన్‌లతో ఏడాది పాటు వ్యాలిడిటీ.. అద్భుతమైన ప్లాన్స్
జియో కీలక ప్రకటన.. ఇకపై సొంత భాషలో ఏఐ సేవలు
జియో కీలక ప్రకటన.. ఇకపై సొంత భాషలో ఏఐ సేవలు