తెలంగాణ : మునిసిపల్ బరి నుంచి జనసేన ఔట్..

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ ఔత్సాహికులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు పార్టీ ప్రతినిధి హరిప్రసాద్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. తెలంగాణలోని 120 మునిసిపాలిటీలకు, 10 మునిసిపల్ కార్పొరేషన్‌లకు జనవరి 22న ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వాయిదా వేయించేందుకు కాంగ్రెస్ నేతలు న్యాయపోరాటానికి దిగగా.. వారి యత్నాలకు హైదరాబాద్ హైకోర్టు గండి కొట్టింది. ఎన్నికల ప్రాసెస్‌కు మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ […]

తెలంగాణ : మునిసిపల్ బరి నుంచి జనసేన ఔట్..
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 08, 2020 | 3:36 PM

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ ఔత్సాహికులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు పార్టీ ప్రతినిధి హరిప్రసాద్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. తెలంగాణలోని 120 మునిసిపాలిటీలకు, 10 మునిసిపల్ కార్పొరేషన్‌లకు జనవరి 22న ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వాయిదా వేయించేందుకు కాంగ్రెస్ నేతలు న్యాయపోరాటానికి దిగగా.. వారి యత్నాలకు హైదరాబాద్ హైకోర్టు గండి కొట్టింది. ఎన్నికల ప్రాసెస్‌కు మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో బుధవారం నుంచి మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ప్రారంభమైపోయింది.

ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ తరపున తెలంగాణ మునిసిపల్ బరిలో దిగాలనుకునే ఔత్సాహికులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. అనివార్య కారణాల వల్ల అధికారికంగా ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదని పవన్ కల్యాణ్ తరపున పార్టీ ప్రతినిధి హరిప్రసాద్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. అదే సమయంలో పార్టీ తరపున పోటీ చేయాలనుకునే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. పార్టీ ఔత్సాహికులంతా ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగవచ్చని జనసేన ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు. సో.. జనసేన అభ్యర్థులకు ఇండిపెండెంట్లుగా పోటీ చేసే అవకాశాన్ని పవన్ కల్యాణ్ ఇచ్చారని, ఇది బంపర్ ఆఫర్ కాక మరేంటని సోషల్ మీడియాలో కామెంట్లు జోరందుకున్నాయి.