AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అత్యంత వింతైన బీచ్..! చేపలు, గవ్వలు, పీతలు లేని ప్రదేశంలో వింత దృశ్యం!

కొన్ని నెలలుగా ఒక బీచ్‌లో ఒకే వింత వస్తువు మళ్లీ మళ్లీ కనిపిస్తోంది. ఆ వస్తువు సుమారుగా ఒక శతాబ్ధం కంటే కూడా పాతవిగా తెలుస్తోంది. ఈ వింత వస్తువులు సముద్రం ఒడ్డున చెల్లాచెదురుగా కనిపించాయి. గత కొద్ది రోజులుగా వరుసగా జరుగుతున్న ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది. గ్లామోర్గాన్‌లోని ఓగ్మోర్-బై-సీ బీచ్‌లో ఇనుప మేకులు పొదిగిన వందలాది విక్టోరియన్ కాలం నాటి తోలు బూట్లు సముద్రం నుండి కొట్టుకురావటం ఇంటర్‌నెట్‌ వేదికగా విపరీతంగా వైరల్‌ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ప్రపంచంలోనే అత్యంత వింతైన బీచ్..! చేపలు, గవ్వలు, పీతలు లేని ప్రదేశంలో వింత దృశ్యం!
Victorian Shoes
Jyothi Gadda
|

Updated on: Jan 13, 2026 | 5:10 PM

Share

కొన్నిసార్లు సముద్రం లోతుల్లో దాగి ఉన్న రహస్యాలను కూడా తన అలలతో ఒడ్డుకు తీసుకువస్తుంది. ఇటీవల, బ్రిటన్‌లోని ఓగ్మోర్‌లోని సీ బీచ్‌లో ఇలాంటి అంతుచిక్కని దృశ్యం కనిపించింది. ఇది చరిత్రకారులను, స్థానిక ప్రజలను ఆశ్చర్యపరిచింది. అక్కడ వందలాది పాత బూట్లు ఇసుకపై చెల్లాచెదురుగా కనిపించాయి. ఇవి సాధారణ బూట్లు కాదు, విక్టోరియన్ శకం నుండి వచ్చిన నల్ల తోలు బూట్లు. ఇవి దాదాపు 150 సంవత్సరాల పురాతనమైనవి.

బ్రిటన్‌లో బీచ్ క్లీనప్ సమయంలో స్వచ్ఛంద సేవకులు చెత్త తొలగింపు పనులు చేస్తుండగా, వారు ప్లాస్టిక్, శిధిలాలను తీసేస్తున్నారు. కానీ, వారి కళ్ళ ముందు 400 కంటే ఎక్కువ నల్ల తోలు బూట్లు, వాటిలో చాలా వరకు హాబ్‌నెయిల్స్‌ పొదిగినవి కనిపించాయి.. ఈ బూట్లు కేవలం ఏదో సాధారణ చెత్తకుప్ప కాదని, అవి విక్టోరియన్ కాలం నాటి బూట్లు అని తెలిసింది. అవి దాదాపు 150 సంవత్సరాల నాటివిగా చెబుతున్నారు.

బీచ్ అకాడమీ వ్యవస్థాపకురాలు ఎమ్మా లాంపోర్ట్ మాట్లాడుతూ, బూట్లు ఫ్రోలిక్ అనే ఓడ నుండి వచ్చాయని, అది 1831లో టస్కర్ రాక్‌ను ఢీకొని మునిగిపోయిందని బలమైన సిద్ధాంతం ఉందని చెప్పారు. ఆ ఓడ ఇటలీ నుండి బూట్లు, ఇతర సామాగ్రిని తీసుకువెళుతోంది. ఈ ప్రమాదంలో దాదాపు 80 మంది మరణించారు. ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. నది ఒడ్డు కోతకు గురైన ప్రతిసారీ, బూట్లు తిరిగి పైకి వస్తుంటాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి

టస్కర్‌ రాక్‌.. అంటే ఓడల స్మశానవాటిక అని కూడా పిలుస్తారని అక్కడి పరిశోధకులు చెబుతున్నారు. ఈ రాక్‌ కారణంగా శతాబ్దాలుగా ఓడలకు ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. ఫ్రోలిక్ నౌక ధ్వంసం తర్వాత నెలల తరబడి, మృతదేహాలు, వస్తువులు ఒడ్డుకు కొట్టుకువచ్చాయని చెప్పారు. ఇప్పుడు, 150 సంవత్సరాల తరువాత, సముద్రం మరోసారి చాలా కాలంగా మరచిపోయిన విషాద జ్ఞాపకాలను తిరిగి తెచ్చింది. చరిత్రకారులకు ఈ ఆవిష్కరణ అమూల్యమైన నిధి వంటిది. ఎందుకంటే సముద్రం నుండి వెలికితీసిన ప్రతి షూ ఒక కథను చెబుతుంది. ఓడ, దాని ప్రయాణీకులు, సముద్రం వాణిజ్యానికి ప్రధాన మార్గంగా ఉన్న కాలం గురించి మరింతగా తెలుసుకునే అవకాశాన్ని కలిగిస్తుంది.

బీచ్ అకాడమీ బృందం ఈ చారిత్రక వస్తువులను సంరక్షించడమే కాకుండా, బీచ్‌ను దాని సహజ స్థితికి పునరుద్ధరించడానికి కూడా కృషి చేస్తోంది. తన బృందం ఇప్పటివరకు 12,000 కంటే ఎక్కువ సముద్రపు చెత్తను తొలగించిందని ఎమ్మా వివరించారు. రాక్‌పూల్ ఆవాసాలను పునరుద్ధరించడమే వారి లక్ష్యం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్‌... మెగాస్టార్‌కి ఊరట!
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్‌... మెగాస్టార్‌కి ఊరట!
వామ్మో.. షుగర్ వల్ల దేశంలో ఇన్ని లక్షల కోట్ల నష్టమా.. డాక్టర్లు..
వామ్మో.. షుగర్ వల్ల దేశంలో ఇన్ని లక్షల కోట్ల నష్టమా.. డాక్టర్లు..
హోంగార్డ్ సర్వీసుల్లోకి ట్రాన్స్ జెండర్స్.. నియామక పత్రాలు అందజేత
హోంగార్డ్ సర్వీసుల్లోకి ట్రాన్స్ జెండర్స్.. నియామక పత్రాలు అందజేత
ప్రపంచంలోనే అత్యంత వింతైన బీచ్..వెలుగులోకి 150 ఏళ్ల నాటి మిస్టరీ!
ప్రపంచంలోనే అత్యంత వింతైన బీచ్..వెలుగులోకి 150 ఏళ్ల నాటి మిస్టరీ!
కూలీ పనులు చేస్తూ కూడా లక్షాధికారి కావచ్చు.. అద్భుతమైన ఐడియా
కూలీ పనులు చేస్తూ కూడా లక్షాధికారి కావచ్చు.. అద్భుతమైన ఐడియా
అనిల్ రావిపూడి ఫస్ట్ మూవీ పటాస్‌ను రిజెక్ట్ చేసిన హీరో ఎవరంటే?
అనిల్ రావిపూడి ఫస్ట్ మూవీ పటాస్‌ను రిజెక్ట్ చేసిన హీరో ఎవరంటే?
గిల్ సేనకు దిమ్మతిరిగే షాక్.. రాజకోట్‌లో ఓటమి ఫిక్స్
గిల్ సేనకు దిమ్మతిరిగే షాక్.. రాజకోట్‌లో ఓటమి ఫిక్స్
శంఖు పూలు.. సాగు చేశారో లక్షల ఆదాయం!
శంఖు పూలు.. సాగు చేశారో లక్షల ఆదాయం!
మీ ఫోన్‌ను తరచుగా ఫ్యాక్టరీ రీసెట్ చేస్తారా? అప్పుడే అసలు సమస్య
మీ ఫోన్‌ను తరచుగా ఫ్యాక్టరీ రీసెట్ చేస్తారా? అప్పుడే అసలు సమస్య
7 ఏళ్లుగా టీమిండియాకు దూరం.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా రీఎంట్రీ
7 ఏళ్లుగా టీమిండియాకు దూరం.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా రీఎంట్రీ