సీఏఏ వ్యతిరేకులపై బీజేపీ ఎంపీ సెన్సేషనల్ కామెంట్స్

పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ)కు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. సీఏఏను వ్యతిరేకించే వారంతా దేశద్రోహులంటూ ఘాటైన పదజాలంతో సంజయ్ విరుచుకుపడ్డారు. సీఏఏను వ్యతిరేకించే వారిని బ్రేకుల్లేని బస్సులో పాకిస్తాన్‌కు పంపిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. పౌరసత్వ సవరణ చట్టం బిల్లుకు మద్దతుగా హన్మకొండలో బుధవారం నాడు భారీ ప్రదర్శన నిర్వహించింది బీజేపీ. ఈ ర్యాలీనుద్దేశించి కరీంనగర్ ఎంపీ సంజయ్ మాట్లాడారు. ‘‘ద్రోహుల్లారా!.. ఖబడ్దార్ మీరు రాళ్లు […]

సీఏఏ వ్యతిరేకులపై బీజేపీ ఎంపీ సెన్సేషనల్ కామెంట్స్
Rajesh Sharma

|

Jan 08, 2020 | 3:54 PM

పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ)కు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. సీఏఏను వ్యతిరేకించే వారంతా దేశద్రోహులంటూ ఘాటైన పదజాలంతో సంజయ్ విరుచుకుపడ్డారు. సీఏఏను వ్యతిరేకించే వారిని బ్రేకుల్లేని బస్సులో పాకిస్తాన్‌కు పంపిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు.

పౌరసత్వ సవరణ చట్టం బిల్లుకు మద్దతుగా హన్మకొండలో బుధవారం నాడు భారీ ప్రదర్శన నిర్వహించింది బీజేపీ. ఈ ర్యాలీనుద్దేశించి కరీంనగర్ ఎంపీ సంజయ్ మాట్లాడారు. ‘‘ద్రోహుల్లారా!.. ఖబడ్దార్ మీరు రాళ్లు పడితే.. మేం బాంబులు పడతాం… మీరు కట్టెలు పడితే.. మేం కత్తులు పడతాం.. మీరు రాకెట్లు పడితే.. మేం లాంఛర్లతో ఎదురుదాడి చేస్తాం…యుద్ధం స్టార్ట్ అయింది.. ఎవరినీ వదిలేది లేదు‘‘ హన్మకొండ ర్యాలీలో సంజయ్ చేసిన కామెంట్లివి.

జాతీయ వాదులకు జైళ్లు కొత్తకాదని, పచ్చ జెండాలతో ర్యాలీ తీసి ఈ ఓరుగల్లు గడ్డని అపవిత్రం చేశారని, మళ్ళీ ఈ గడ్డను పవిత్రం చేయడానికే ఈ కాషాయం ర్యాలీ అంటూ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు ఎంపీ సంజయ్. వాస్తవాలను దాచి అవాస్తవాలను ప్రచారం చేస్తున్న మూర్ఖపు పార్టీల వల్లనే ఆందోళనలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. సీఏఏ ఎవరికి వెతిరేకం కాదని చెప్పిన సంజయ్.. గాంధీ, నెహ్రూలు చెప్పిన విధి విధానాలనే ఈ సీఏఏ చట్టంలో మోదీ ప్రభుత్వం పొందు పరిచిందన్నారు.

370 ఆర్టికల్ రద్దు, అయోధ్య తీర్పు వచ్చినప్పుడు ఎలాంటి ఆందోళనలు జరగలేదు.. ఇపుడు ఓ ప్రణాళిక ప్రకారం ఈ దేశంలో విచ్ఛిన్నం స్పృష్టించాలని కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు చూస్తున్నారని సంజయ్ ఆరోపించారు. పార్లమెంట్‌లో పూర్తిస్థాయిలో చర్చ జరిగిన తరువాతనే ఈ యాక్ట్ అమలులోకి వచ్చిందని అన్నారు. ఇస్లామిక్ దేశాల నుండి వస్తున్న పైసలతో ఈ ఉద్యమాలు చేస్తున్నారని, లుంబిని పార్కులో బాంబులు వేసిన వారికి దేశ పౌరసత్వం ఇమ్మంటారా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు.

ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ 10 నిమిషాలు టైమిస్తే మొత్తం హిందువులను ఖతం చేస్తానని అన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు సంజయ్. మునిసిపాలిటీ ఎన్నికల్లో ముస్లిం ఓట్లకోసం ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu