AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం కారణంగా శ్రీలంక, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. ఆంధ్రప్రదేశ్ కు అల్పపీడనం ముప్పు తప్పింది.. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది..

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..
Andhra Pradesh Telangana Weather Forecast
Shaik Madar Saheb
|

Updated on: Jan 13, 2026 | 9:26 PM

Share

బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం కారణంగా శ్రీలంక, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. ఆంధ్రప్రదేశ్ కు అల్పపీడనం ముప్పు తప్పింది.. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది.. తాజా వెదర్ రిపోర్ట్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, యానములో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

మంగళవారం, బుధవారం, గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశము ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

మంగళవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.

ఇవి కూడా చదవండి

బుధవారం, గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశము ఉంది.

రాయలసీమ:-

మంగళవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.

బుధవారం, గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.

గమనిక :- రాగల 5 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు ఉండదు.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు:

తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా తూర్పు/ఆగ్నేయ దిశల నుండి వీచుచున్నవి. వీటి ప్రభావంతో రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. మంగళవారం, బుధవారం, గురువారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us