AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: రెండో వన్డే నుంచి నలుగురు ఔట్.. గత మ్యాచ్‌లో తోపులైనా బెంచ్‌కే ఫిక్స్ చేసిన గంభీర్..?

IND vs NZ Rajkot ODI Playing XI: రెండో వన్డేకు భారత జట్టు సిద్ధమైంది. ఇప్పటికే తొలి వన్డే గెలిచి దూకుడుపై ఉన్న భారత జట్టు.. రాజ్‌కోట్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. అయితే, గంభీర్ ప్లేయింగ్ 11లో కీలక మార్పులు చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

IND vs NZ: రెండో వన్డే నుంచి నలుగురు ఔట్.. గత మ్యాచ్‌లో తోపులైనా బెంచ్‌కే ఫిక్స్ చేసిన గంభీర్..?
Ind Vs Nz 2nd OdiImage Credit source: Hotstar
Venkata Chari
|

Updated on: Jan 13, 2026 | 3:10 PM

Share

IND vs NZ Rajkot ODI Playing XI: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగో రెండో వన్డే రాజకోట్‌లో జరగనుంది. అయితే, జట్టులోని ఆటగాళ్లందరికీ ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం రావడం సాధ్యం కాదు. టీమ్ మేనేజ్‌మెంట్ ప్రస్తుతం ఉన్న జట్టు కలయికనే కొనసాగించే అవకాశం ఉంది. దీనివల్ల కొందరు ఆటగాళ్లు రిజర్వ్ బెంచ్‌పై కూర్చోవాల్సి వస్తుంది. ఫలితంగా, రాజకోట్ వన్డేలో నలుగురు క్రికెటర్లు మైదానంలోకి దిగే అవకాశం కోల్పోనున్నారు.

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఈ వన్డే సిరీస్ కోసం టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ ఇప్పటికే ఒక బలమైన, సమతుల్యమైన జట్టును ఎంపిక చేసింది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులో క్రమం తప్పకుండా కొనసాగుతూ, టాప్ ఆర్డర్‌లో అనుభవాన్ని, స్థిరత్వాన్ని అందిస్తున్నారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేస్తారని జట్టు భావిస్తోంది.

ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ ఇండియా, సిరీస్ నిర్ణయాత్మక దశలో ఉన్నందున ప్రయోగాలు చేయకుండా పాత ఫార్ములానే నమ్ముకోవాలని చూస్తోంది. సొంత గడ్డపై తమ ఆధిపత్యాన్ని చాటుకోవడమే లక్ష్యంగా భారత్ ఈ వ్యూహాన్ని అనుసరిస్తోంది.

ఇవి కూడా చదవండి

బెంచ్‌కే పరిమితం కానున్న ప్లేయర్లు..

గత మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, రాజకోట్ వన్డేలో కొందరు కీలక ఆటగాళ్లకు చోటు దక్కడం కష్టంగా కనిపిస్తోంది. గత వన్డేలో సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ తిరిగి రావడంతో బెంచ్‌కే పరిమితం కానున్నారు. దీనివల్ల ఓపెనింగ్‌లో ఆయనకు చోటు దక్కడం లేదు.

అదేవిధంగా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కూడా మరోసారి నిరీక్షించక తప్పదు. కేఎల్ రాహుల్ మొదటి ఛాయిస్ వికెట్ కీపర్‌గా కొనసాగే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తుండటంతో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఇక ఫాస్ట్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ తన అవకాశం కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

బౌలింగ్ విభాగంలో స్థానాలు ఖరారు..

జనవరి 14న రాజకోట్‌లో జరగనున్న రెండో వన్డే కోసం భారత బౌలింగ్ విభాగం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఉండనుంది. మొహమ్మద్ సిరాజ్ రాకతో పేస్ విభాగం బలోపేతమైంది. మొదటి వన్డేలో ఆయన ప్రదర్శనతో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దాదాపు ఖాయమైంది.

హర్షిత్ రాణా ఇప్పటికే తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగా, అర్ష్‌దీప్ సింగ్‌కు బదులుగా పిచ్ పరిస్థితులను బట్టి ప్రసిద్ధ్ కృష్ణకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. స్పిన్ విభాగంలో గౌతమ్ గంభీర్ ఆల్‌రౌండర్లపై నమ్మకాన్ని ఉంచారు. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ త్రయం జట్టుకు అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ అదనపు బలాన్ని ఇవ్వనున్నారు.

రాజకోట్ వన్డే కోసం భారత అంచనా జట్టు (Probable XI):

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..