కృత్రిమ మేధస్సు(AI)తో వచ్చిన తొలి గూగుల్ డూడుల్
గూగుల్ డూడుల్ ద్వారా ఏ రోజుకారోజు ప్రముఖులను, పండుగులను గుర్తిస్తూ వాళ్లకు ఘనంగా నివాళులర్పిస్తుందీ టెక్ దిగ్గజం. తాజాగా తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు)తో ఓ డూడుల్‌ను తీసుకొచ్చింది గూగుల్. జర్మన్ మ్యూజీషియన్ సెబాస్టియన్ బాక్ జయంతి సందర్భంగా ఈ డూడుల్‌ను విడుదల చేశారు. ఈ ఏఐ డూడుల్‌పై ఉన్న ప్లే బట్‌ను క్లిక్ చేస్తే బాక్ గురించిన విశేషాలను తెలుసుకోవడంతోపాటు సొంతంగా మ్యూజిక్ కంపోజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. బాక్ 18వ శతాబ్దానికి […]
గూగుల్ డూడుల్ ద్వారా ఏ రోజుకారోజు ప్రముఖులను, పండుగులను గుర్తిస్తూ వాళ్లకు ఘనంగా నివాళులర్పిస్తుందీ టెక్ దిగ్గజం. తాజాగా తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు)తో ఓ డూడుల్‌ను తీసుకొచ్చింది గూగుల్. జర్మన్ మ్యూజీషియన్ సెబాస్టియన్ బాక్ జయంతి సందర్భంగా ఈ డూడుల్‌ను విడుదల చేశారు. ఈ ఏఐ డూడుల్‌పై ఉన్న ప్లే బట్‌ను క్లిక్ చేస్తే బాక్ గురించిన విశేషాలను తెలుసుకోవడంతోపాటు సొంతంగా మ్యూజిక్ కంపోజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. బాక్ 18వ శతాబ్దానికి చెందిన సంగీతకారుడు. మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీ సాయంతో మీరు సృష్టించే మ్యూజిక్‌ను బాక్ స్టైల్లోకి ఇది మారుస్తుందని గూగుల్ ఏఐ ప్రోగ్రామ్ మేనేజర్ లారెన్ మర్ఫీ తెలిపారు.