తల్లిదండ్రుల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న లోకేశ్

మంగళగిరి: నామినేషన్ వేయడానికి ముందు నారా లోకేశ్ తల్లిదండ్రుల కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. కాసేపట్లో నామినేషన్ వేస్తారనగా తల్లిదండ్రుల కాళ్లకు లోకేశ్ నమస్కరించారు. తండ్రి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తల్లి నారా భువనేశ్వరి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. పక్కనే సతీమణి నారా బ్రాహ్మణి కూడా ఉన్నారు. ఈ సందర్భంలో కుమారుడు లోకేశ్‌ను తల్లి నారా భువనేశ్వరి కౌగిలించుకుని ప్రేమగా […]

తల్లిదండ్రుల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న లోకేశ్
Follow us
Vijay K

|

Updated on: Mar 22, 2019 | 12:35 PM

మంగళగిరి: నామినేషన్ వేయడానికి ముందు నారా లోకేశ్ తల్లిదండ్రుల కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. కాసేపట్లో నామినేషన్ వేస్తారనగా తల్లిదండ్రుల కాళ్లకు లోకేశ్ నమస్కరించారు.

తండ్రి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తల్లి నారా భువనేశ్వరి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. పక్కనే సతీమణి నారా బ్రాహ్మణి కూడా ఉన్నారు. ఈ సందర్భంలో కుమారుడు లోకేశ్‌ను తల్లి నారా భువనేశ్వరి కౌగిలించుకుని ప్రేమగా ఆశీర్వదించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న అనంతరం లోకేశ్ నామినేషన్‌కు వేలాది కార్యకర్తల తోడుగా బయలుదేరి వెళ్లారు.