AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Orange juice: రోజూ గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తాగితే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే..

ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల మన ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది తక్షణ శక్తిని అందించడంలో సూపర్‌గా పనిచేస్తుంది. అందుకే చాలా మంది ఈ జ్యూస్‌ను తాగేందుకు ఇష్టపడుతారు. కాబట్టి ఈ జ్యూస్‌ రోజూ తాగడం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో.. దీని వల్ల ఇంకా ఏఏ ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

Orange juice: రోజూ గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తాగితే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే..
Orange Juice Benefits
Anand T
|

Updated on: Jan 29, 2026 | 5:52 PM

Share

నారింజ రసాన్ని తాగేందుకు చాలా మంది ఇష్టపడుతారు. ఎందుకంటే ఇది ఉప్పుగా, తీపిగా రుచికి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే తక్షణ శక్తిని కూడా అందిస్తుంది. అయితే కొన్నాళ్లుగా చాలా మంది వెల్నెస్ ఔత్సాహికులు ఈ జ్యూస్‌ను పక్కపెట్టారు. ఎందుకంటే జ్యూస్‌లు అనేవి రిఫ్రెషింగ్‌గా ఉన్నప్పటికీ, మొత్తం పండ్లు అందించే ప్రయోజనాలను మాత్రం ఇవ్వలేవు. జ్యూస్ చేసే క్రమంలో మనం పండ్ల తొక్క, గుజ్జును తొలగించడం వల్ల వాటిలో ఉండే ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను కోల్పోతాము. అలా ఫైబర్ లేని జ్యూస్‌ తాగినప్పుడు రక్తంలో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు ఏర్పడవచ్చు. అలాగే ఇది ఆకలి పెరగడానికి కారణం కావచ్చు.

నిజానికి, వాణిజ్యపరంగా లభించే అనేక పండ్ల రసాలలో రుచిని పెంచేందుకు అదనపు చక్కెరలు యాడ్ చేస్తారు. వీటి కారణంగా ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్‌తో సహా వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒక గ్లాసు నారింజ రసం తయారు చేయడానికి దాదాపు 2-5 నారింజ పండ్లు అవసరం పడుతుంది. దీని నుంచి ఎక్కువ కేలరీల కలిగిన జ్యాస్‌ను తీయవచ్చు. కానీ ఈ జ్యూస్‌లో మొత్తం పండులో ఉండే ఫైబర్, పోషకాలు మాత్రం ఉండవు. అయినప్పటికీ క్రమం తప్పకుండా నారింజ జ్యూస్ తాగడం వల్ల రక్తపోటును తగ్గించడం, శరీరంలో మంటను తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని పెంచడం

అధ్యయనాల్లో తేలిందేంటి?

రక్తపోటును తగ్గించడం: శాస్త్రవేత్తలు 12 వారాల పాటు చేపట్టిన ఒక అధ్యయనంలో ప్రీ- లేదా స్టేజ్-1 హైపర్‌టెన్షన్ ఉన్న వ్యక్తులకు రోజుకు 500 mL నారింజ జ్యూస్ ఇచ్చారు. 12 వారాల తర్వాత వారిలో వచ్చిన మార్పులను గమనించారు. వారిలో సిస్టోలిక్ రక్తపోటు (SBP), పల్స్ ప్రెజర్ (PP)లో గణనీయమైన తగ్గుదలను గుర్తించారు. క్రమం తప్పకుండా ఈ జ్యూస్ తగడం వల్ల డయాస్టొలిక్ రక్తపోటు (DBP) కూడా తగ్గింది. అలాగే సాధారణ బరువు ఉన్నవారిలో SBP తగ్గుదల, అధిక బరువు ఉన్నవారిలో DBP తగ్గుదలను కూడా గుర్తించారు. మొత్తానికి ఈ అధ్యయనం ద్వారా ఆరెంజ్ జ్యూస్ వివిధ రకాల శరీరాలలో రక్తపోటు నిర్వహణకు తోడ్పడుతుందని తెలుసుకున్నారు.

వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం

గుండె జబ్బులు, మధుమేహం, అనేక దీర్ఘకాలిక అనారోగ్యాలు చాలా వరకు ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా వస్తాయి. అయితే 100 శాతం ఆరెంజ్ జ్యూస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఇంటర్‌లుకిన్-6 వంటి తక్కువ స్థాయి శోథ మార్కర్లతో సంబంధం కలిగి ఉండి.. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అధిక కొలెస్ట్రాల్ లేదా ట్రైగ్లిజరైడ్స్ ఉన్న వ్యక్తులపై చేసిన ఒక ప్రయోగంలో 90 రోజుల పాటు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల యాంటీఆక్సిడెంట్ సామర్థ్యం పెరిగి, లిపిడ్ పెరాక్సిడేషన్ తగ్గింది. ఈ యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు రక్త నాళాలను రక్షించడంలో సహాయపడతాయి. అలాగే హృదయ, జీవక్రియ వ్యాధుల దీర్ఘకాలిక ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

గుండె ఆరోగ్యం, జీవక్రియ

క్రమం తప్పకుండా నారింజ రసం తాగడం వల్ల జీవక్రియ ఆరోగ్య అంశాలను మెరుగుపరుస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఇది మంచి కొలెస్ట్రాల్ పెంచడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని తేలింది. అలాగే శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరుస్తుందని పేర్కొన్నాయి. ముఖ్యంగా ఆరెంజ్ జ్యూస్‌లో ఉండే విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, సిట్రస్ ఫ్లేవనాయిడ్లు గుండె, జీవక్రియ, రోగనిరోధక శక్తిని పెంచుతాయిని తెలింది.

రోజూ ఎంత ఆరెంజ్ జ్యూస్ తాగాలి?

చాలా అధ్యయనాల తర్వాత 8–12 వారాల పాటు రోజుకు 500 mL (సుమారు రెండు కప్పులు) తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే అప్పుడప్పుడు నారింజ రసం తాగడం కంటే క్రమం తప్పకుండా తీసుకోవడం మరింత ప్రభావవంతంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే మీరు జ్యూస్ తాగేప్పుడు అందులో ఎలాంటి షుగర్ యాడ్ చేసుకోవద్దని సూచిస్తున్నారు.

(గమనిక:  ఈ వ్యాపంలో పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్, నివేదిక ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే.. వైద్యులను సంప్రదించండి)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రోజూ గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తాగితే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే
రోజూ గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తాగితే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే
అన్నీ ఉన్నా.. ఆనందం ఎందుకు దూరమవుతోంది..? ఈ పరిస్థితి ప్రమాదకరమా?
అన్నీ ఉన్నా.. ఆనందం ఎందుకు దూరమవుతోంది..? ఈ పరిస్థితి ప్రమాదకరమా?
జిడ్డు మరకల నుంచి.. సింక్ బ్లాకేజ్ వరకు.. దీంతో అన్నీ క్లీన్!
జిడ్డు మరకల నుంచి.. సింక్ బ్లాకేజ్ వరకు.. దీంతో అన్నీ క్లీన్!
తాగి తాగి లివర్‌ తన్నేసిందా..? ఇప్పటికైనా బాగుచేసుకోండిలా..!
తాగి తాగి లివర్‌ తన్నేసిందా..? ఇప్పటికైనా బాగుచేసుకోండిలా..!
T20I World Cup: వామ్మో.. 16 ఏళ్లుగా టీమిండియాకు నిరాశేనా..?
T20I World Cup: వామ్మో.. 16 ఏళ్లుగా టీమిండియాకు నిరాశేనా..?
మీకు కూతురు ఉందా.. ఇలా చేస్తే మీ చేతికి రూ.72 లక్షలు..
మీకు కూతురు ఉందా.. ఇలా చేస్తే మీ చేతికి రూ.72 లక్షలు..
రామ్ చరణ్ నా క్లాస్‏మెట్.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ డైరెక్టర్.
రామ్ చరణ్ నా క్లాస్‏మెట్.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ డైరెక్టర్.
ఇక నుంచి నేరుగా రైతుల అకౌంట్లోకి యూరియా సబ్సిడీ..?
ఇక నుంచి నేరుగా రైతుల అకౌంట్లోకి యూరియా సబ్సిడీ..?
ఏడాదిలో ఒకసారి మాత్రమే తెరిచే అరుదైన ఆలయం.. ఎక్కడుందో తెలుసా..?
ఏడాదిలో ఒకసారి మాత్రమే తెరిచే అరుదైన ఆలయం.. ఎక్కడుందో తెలుసా..?
డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు వినికిడి శక్తిని కోల్పోతారా?
డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు వినికిడి శక్తిని కోల్పోతారా?