సూసేకి చిన్నవే అయినా.. గట్టి లాభాలే ఉన్నాయ్!

28 January 2026

TV9 Telugu

TV9 Telugu

తియ్యతియ్యటి అరిసెలూ లడ్డూలూ బూరెల్లోనూ, ఇంకా కారంకారం జంతికలూ సకినాలూ చెక్కలూ.. ఇలా ఏ పిండి వంటకం చేసినా నువ్వులు ఉండి తీరాల్సిందే. వంటకానికి కమ్మటి ఫ్లేవర్‌ని ఇచ్చే ఈ గింజలు చలికాలంలో బెస్ట్‌ హెల్దీ ఫుడ్‌

TV9 Telugu

రుచికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలు ఉపయోగపడతాయి. నువ్వుల్ని కాల్షియం పవర్‌ హౌస్‌ అంటారు. శరీరంలోని ఎముకల బలానికి కావాల్సిన కాల్షియంతోపాటు నువ్వుల గింజల్లో విటమిన్లూ, మినరల్స్‌ ఉంటాయి

TV9 Telugu

చలికాలంలో జలుబూ, దగ్గూ, ఫ్లూ వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకు తోడ్పడే ఆహార పదార్థాల్లో ఒకటి నువ్వులు

TV9 Telugu

వీటిల్లోని పోషకాలూ, యాంటీ ఆక్సిడెంట్లూ అనారోగ్యాన్ని దరిచేరనివ్వవు. శీతకాలంలో జీర్ణవ్యవస్థ కూడా కాస్త నెమ్మదిస్తుంది. నువ్వుల్లో ఉండే పీచు ఆ సమస్యకు చెక్‌ పెడుతుంది. మలబద్ధకాన్ని దూరం చేసి, జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది

TV9 Telugu

మధుమేహులు రక్తంలోని చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచుకోవడానికి నువ్వులు ఎంతగానో సాయపడతాయని పరిశోధనల్లో బయటపడింది

TV9 Telugu

అలసట, నీరసాన్ని తగ్గించడంలోనూ వీటిల్లోని మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. కొలెస్ట్రాల్‌తోపాటు, ట్రైగ్లిజరాయిడ్లూ అదుపులో ఉంటాయి. గుండెజబ్బుల నుంచీ రక్షణ ఇస్తాయి

TV9 Telugu

నువ్వులు మెదడు పనితీరును మెరుగుపరచడంలోనూ సాయపడతాయి. నరాల వ్యవస్థను బలోపేతం చేసి, మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇందులోని అధిక ఐరన్‌- హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది

TV9 Telugu

రోజూ ఉదయాన్నే చెంచా నువ్వుల్ని తింటే ఆస్తమా తగ్గుతుంది. ఇంకా ఇందులోని సెలీనియం థైరాయిడ్‌ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తపోటును సైతం అదుపు చేస్తుంది