Mehul Choksi: ఇండియాకు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అప్పగింతలో జాప్యం జరిగే సూచన, డొమినికా కోర్టు అడ్డుపుల్ల, జూన్ 2 న విచారణ

ఇండియాకు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అప్పగింతలో జాప్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తన అప్పగింతను సవాలు చేస్తూ ఆయన అక్కడి కోర్టులో ఇంజంక్షన్ పిటిషన్ దాఖలు చేశాడు.

Mehul Choksi: ఇండియాకు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అప్పగింతలో  జాప్యం జరిగే సూచన, డొమినికా కోర్టు అడ్డుపుల్ల, జూన్ 2 న విచారణ
Mehul Choksi
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: May 29, 2021 | 9:09 AM

Mehul Choksi: ఇండియాకు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అప్పగింతలో జాప్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తన అప్పగింతను సవాలు చేస్తూ ఆయన అక్కడి కోర్టులో ఇంజంక్షన్ పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు ఆయనను భారత్ కు అప్పగించరాదని జస్టిస్ ఎం.ఈ. బర్నే ఆదేశాలు జారీ చేశారు. డొమినికాలో ఉండేందుకు అనుమతించాలన్న ఆయన అభ్యర్థనకు సంబంధించి ఈ కేసు విచారణను జూన్ 2 కు వాయిదా వేశారు. చోక్సీ తరఫు లాయర్లు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై జూన్ 2 న విచారణ జరగాలని. ఆ రోజు ఉదయం పదిన్నర గంటలకల్లా అటార్నీ జనరల్, పోలీస్ చీఫ్ తమ అఫిడవిట్లను సమర్పించాలని న్యాయమూర్తి అదెశ్జించారు. మరోవైపు మెహుల్ కు కోవిద్ టెస్ట్ నిర్వహణకు, ఇతర వైద్య పరీక్షలకోసం ఆయనను ఆసుపత్రికి తరలించాలని కూడా ఆ మహిళా న్యాయమూర్తి సూచించారు. మెహుల్ గత ఆదివారం ఆంటిగ్వా నుంచి పరారై క్యూబాకు వెళ్తుండగా డొమినికా పోలీసులకు పట్టుబడ్డారు. 2018 నుంచి ఆంటీగ్వాలో నివసిస్తున్న ఆయనపై భారత్ లో బ్యాంకులను ఛీట్ చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి..

ఇలా ఉండగా తమ క్లయింటు శరీరంపై గాయాలు ఉన్నాయని, ఆయనను డొమినికా పోలీసులు బలవంతంగా నౌకలోకి ఎక్కించారని ఇండియాలోని ఆయన తరఫు లాయర్ విజయ్ అగర్వాల్ తెలిపారు. ఆయనను వారు కొట్టినట్టు తాము భావిస్తున్నామన్నారు. ఇండియాకు వారు తిప్పి పంపే యోచనలో ఉన్నారని విజయ్ అగర్వాల్ అన్నారు. మరోవైపు మెహుల్ అప్పగింత విషయంలో భారత అధికారులు డొమినికా అధికారులతో చర్చలు జరుపుతున్నారు

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: పెళ్లి లో వధువు చేసిన అల్లరి చేష్టలు.. ఫిదా అయిన నెటిజన్లు.. ( వీడియో )

Rare Bird: నల్లమలలో కెమెరాకు చిక్కిన అరుదైన ‘అడవి రైతు’ పక్షి.. ( వీడియో )

David Warner: వార్నర్ కు తెలుగు రాయడం తెలుసా..!! తన భార్యకు తెలుగులో లవ్ ప్రపోజ్.. ( వీడియో )

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?