బాలు త్వరగా కోలుకోవాలి.. దేవుడా.. మా ప్రార్థన ఇదే

ఎస్బీ బాలు సుమధురమైన గాత్రంలో మరిన్నేళ్లు యావత్ భారతాన్నీ అలరించాలి. అంటే ఆయన కోలుకోవాలి. అందరి మాట ఇదే.. అందరి ప్రార్థనా ఇదే. కొద్ది సేపటి క్రితం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇదే ట్వీట్ చేశారు.

బాలు త్వరగా కోలుకోవాలి.. దేవుడా.. మా ప్రార్థన ఇదే
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 24, 2020 | 9:02 PM

ఎస్బీ బాలు సుమధురమైన గాత్రంలో మరిన్నేళ్లు యావత్ భారతాన్నీ అలరించాలి. అంటే ఆయన కోలుకోవాలి. అందరి మాట ఇదే.. అందరి ప్రార్థనా ఇదే. కొద్ది సేపటి క్రితం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇదే ట్వీట్ చేశారు. బాలు సర్ కోలుకోవాలంటూ ప్రార్థించారు. అందరూ ప్రార్థించాలని కోరారు.

గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియగానే కొద్ది సేపటి క్రితం నటుడు కమల్‌హాసన్‌ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లారు. బాలును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు, ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కరోనా నుంచి కోలుకున్న ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి గత 24 గంటల్లో విషమించిందని ఎంజీఎం బులిటెన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎక్మోతో పాటు, ఆయనకు ప్రాణాధార వ్యవస్థ ద్వారా చికిత్స అందిస్తున్నామని ఎంజీఎం వైద్యులు తెలిపారు.