ATM: ఇండియా వన్ ఏటీఎమ్‌లో రూ. 100 ఎంటర్ చేస్తే రూ. 500.. ఎగబడ్డ ఖాతాదారులు.. కారణమేంటంటే..
ATM: ఏటీఎమ్‌లో రూ. 100 నొక్కితే... రూ. 500 వస్తే ఎలా ఉంటుంది..? ఎగిరి గంతులేస్తారు కదూ.! వనపర్తి జిల్లాలో ఇలాంటి సంఘటనే జరిగింది. వనపర్తిలోని అమరచింతలోని ఇండియా వన్ ఏటీఎమ్‌లో...
ATM: ఏటీఎమ్‌లో రూ. 100 నొక్కితే… రూ. 500 వస్తే ఎలా ఉంటుంది..? ఎగిరి గంతులేస్తారు కదూ.! వనపర్తి జిల్లాలో ఇలాంటి సంఘటనే జరిగింది. వనపర్తిలోని అమరచింతలోని ఇండియా వన్ ఏటీఎమ్‌లో ఖాతాదారులు వంద రూపాయలు డ్రా చేస్తే రూ. 500 నోట్లు వచ్చాయి. అలాగనీ ఖాతాలో నుంచి రూ. 500 కట్ అయ్యాయంటే మీరు పొరబడినట్లే. ఖాతాలో నుంచి వంద రూపాయలు కట్ అవుతే.. చేతికి 500 రూపాయలు వచ్చాయి. ఈ విషయం తెలియడంతో జనాలు ఏటీఎమ్ దగ్గరకు ఒక్కసారిగా ఎగబడ్డారు. వందకు.. ఐదు వందలు వస్తుండడంతో పండగ చేసుకున్నారు. భారీగా నగదు డ్రా చేసుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు పెట్రోలింగ్‌కు రావడంతో ఏటీఎమ్ ముందు గుమిగూడిన జనాలు ఒక్కసారిగా అక్కడి నుంచి పారిపోయారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయంగా అసలు విషయం తెలిసింది. దీంతో వెంటనే ఏటీఎమ్‌కు తాళం చేసి సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. సంబంధిత ఏటీఎమ్ అధికారులు పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఇక ఏటీఎమ్‌లో నెలకొన్న సాంకేతిక లోపంతో గత ఐదు రోజులుగా ఏకంగా రూ. 5,80,000 అదనంగా విత్ డ్రా అయినట్లు అధికారులు గుర్తించారు. డబ్బులు సెట్ చేసే క్రమంలో రూ. 100 ట్రేలో రూ. 500 నోట్లను పెట్టడంతో ఇలా జరిగిందని తేల్చారు. అదనంగా డబ్బు పొందిన ఖాతాదారులు తమకు తాముగా వచ్చి డబ్బు అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Also Read: AP Corona Cases: ఏపీలో కొత్తగా 22,517 కరోనా పాజిటివ్ కేసులు.. ప్రమాదకరంగా మరణాలు
Black Fungus: తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్‌ఫంగస్ కేసులు.. శ్రీకాకుళం, ఖమ్మం జిల్లాల్లో గుర్తింపు
SBI Employee Murder: రోడ్డుపై కారు పార్కింగ్ విషయంలో గొడవ.. ఒకరిని కత్తితో పొడిచి చంపిన దుండగులు..!