AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Employee Murder: రోడ్డుపై కారు పార్కింగ్ విషయంలో గొడవ.. ఒకరిని కత్తితో పొడిచి చంపిన దుండగులు..!

పార్కింగ్ విషయంలో గొడవ చిలికి చిలికి గాలి వానగా మారి ప్రాణాల మీదకు వచ్చింది. క్షణికావేశంలో ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హతమార్చారు దుండగులు.

SBI Employee Murder: రోడ్డుపై కారు పార్కింగ్ విషయంలో గొడవ.. ఒకరిని కత్తితో పొడిచి చంపిన దుండగులు..!
Murder
Balaraju Goud
|

Updated on: May 15, 2021 | 5:09 PM

Share

SBI Employee Murdered: చిన్నపాటి గొడవ ఓ మనిషి ప్రాణం పోయింది. పార్కింగ్ విషయంలో గొడవ చిలికి చిలికి గాలి వానగా మారి ప్రాణాల మీదకు వచ్చింది. క్షణికావేశంలో ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హతమార్చారు దుండగులు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో ఈ దారుణం వెలుగుచూసింది. నగరంలోని సంతోష్ నగర్‌‌లో ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేయడం కలకలంరేపింది. మహేశ్వరరెడ్డి అనే యువకుడు తెలంగాణలో ఎస్‌బీఐలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఇదే క్రమంలో కర్నూలుకు వచ్చిన మహేశ్వర్ రెడ్డి మోటార్ బైక్ వెళ్తుండగా ఘాతుకానికి ఒడిగట్టారు దుండగులు.

అయితే, సంతోష్ నగర్‌లో రాత్రి రోడ్డుకు కారు అడ్డంగా ఉందని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహేశ్వర రెడ్డి హరన్ కొట్టాడు. దీంతో కారు యజమానులు మహేశ్వరరెడ్డితో గొడవకు దిగారు. ఇంతలో ఘర్షణ సర్దుమణిగి ఎవరికి వారు వెళ్లిపోయారు. అయితే, మహేశ్వర రెడ్డి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో కాపుకాసిన దుండగులు అతి దారుణంగా కత్తితో పొడిచి హత్యచేశారు. మృతుడు తెలంగాణ రాష్ట్రం మనపాడు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈఘటన పై 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాఫ్తు చేస్తున్నారు.

Read Also…  Coronavirus: 10 వేలకు పైగా పాముల‌ను ర‌క్షించాడు.. కోవిడ్ కాటుకు బ‌లైపోయాడు

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!