Hospitals : కొవిడ్ చికిత్సకు నోటిఫై చేసిన 39 ప్రైవేట్ ఆస్పత్రుల బాగోతం.. హాస్పిటల్స్ స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించిన కలెక్టర్

Private hospitals : ప్రైవేట్ ఆస్పత్రులు పద్దతి మార్చు కోకుండా అక్రమాలకు పాల్పిడితే ఆసుపత్రులను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ సిబ్బందితో నిర్వహించడం జరుగుతుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర రెడ్డి హెచ్చరించారు...

Hospitals : కొవిడ్ చికిత్సకు నోటిఫై చేసిన 39 ప్రైవేట్ ఆస్పత్రుల బాగోతం..  హాస్పిటల్స్ స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించిన కలెక్టర్
Follow us
Venkata Narayana

|

Updated on: May 15, 2021 | 7:04 PM

Private hospitals : ప్రైవేట్ ఆస్పత్రులు పద్దతి మార్చు కోకుండా అక్రమాలకు పాల్పిడితే ఆసుపత్రులను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ సిబ్బందితో నిర్వహించడం జరుగుతుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర రెడ్డి హెచ్చరించారు. జిల్లాలో అక్రమాలకు పాల్పడుతున్న పలు ప్రయివేట్ ఆస్పత్రులకు ఆయన ఇవాళ భారీగా జరిమానాలు విధించారు. కొవిడ్ చికిత్స కోసం 50 శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ, ఈ.హెచ్.ఎస్ పథకాల క్రింద నగదు రహిత చికిత్సకు కేటాయించక పోవడం, నిర్థేశించిన రేట్లకు మించి ఫీజులు వసూలు చేయడం, నిబంధనల ఉల్లంఘకు పాల్పడడం.. తదితర కారణాలపై 39 కొవిడ్ నోటిఫైడ్ ప్రయివేట్ ఆసుపతులకు భారీ జరిమానా వేశారు. ఒక కోటి 54 లక్షల రూపాయల మేరకు పెనాల్టీ విధిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, విజిలెన్స్ అధికారులు, క్లస్టర్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ లు ఇవాళ నిర్వహించిన తనిఖీలలో జిల్లాలో కొవిడ్ చికిత్సకు నోటిఫై చేసిన 39 ప్రయివేట్ ఆసుపత్రుల బాగోతం బట్టబయలైంది. ఒక్కో ఆస్పత్రికి 2 లక్షల నుండి 10 లక్షల వరకూ ఫైన్ చొప్పున మొత్తం కోటీ 54 లక్షల పెనాల్టీ విధించామని కలెక్టర్ తెలిపారు. ఫైన్ మొత్తాన్ని ఆయా ప్రైవేట్ ఆసుపత్రులు 48 గంటలలోపు ఆరోగ్యశ్రీ అకౌంటుకు చెల్లించాలని ఆదేశించారు.

Read also : Revanth Reddy : కరోనా బాధితులకు ఉచిత భోజనం.. రోజూ వెయ్యిమందికి అన్నదానం ప్రారంభించిన ఎంపీ రేవంత్ రెడ్డి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!