టిఫిన్ తిని స్నానం చేస్తే.. ఆరోగ్య సమస్యలెన్నో వస్తాయట.!

Don’t Eat Breakfast After Bath: ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యకరంగా ఉండాలంటే.. ప్రతీ ఒక్కరూ ఉదయాన్నే పౌష్టిక విలువలు నిండిన అల్పాహారాన్ని తీసుకోవాలని వైద్యు నిపుణులు చెబుతుంటారు. ఇక మనం తీసుకునే టిఫిన్.. మన ఆలోచనా తీరును మార్చేస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే కొంతమందికి అల్పాహారం తీసుకున్నాక స్నానం చేయడం అలవాటు. అయితే అలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలెన్నో వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అల్పాహారం తీసుకున్న తర్వాత స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని.. ఆ […]

టిఫిన్ తిని స్నానం చేస్తే.. ఆరోగ్య సమస్యలెన్నో వస్తాయట.!
Follow us

|

Updated on: Oct 29, 2020 | 11:30 PM

Don’t Eat Breakfast After Bath: ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యకరంగా ఉండాలంటే.. ప్రతీ ఒక్కరూ ఉదయాన్నే పౌష్టిక విలువలు నిండిన అల్పాహారాన్ని తీసుకోవాలని వైద్యు నిపుణులు చెబుతుంటారు. ఇక మనం తీసుకునే టిఫిన్.. మన ఆలోచనా తీరును మార్చేస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే కొంతమందికి అల్పాహారం తీసుకున్నాక స్నానం చేయడం అలవాటు. అయితే అలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలెన్నో వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అల్పాహారం తీసుకున్న తర్వాత స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని.. ఆ ప్రభావం జీర్ణాశయంపై పడుతుందని డాక్టర్లు తెలిపారు. దాని ఫలితంగా వాంతులు, అల్సర్, అసిడిటీ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అన్నారు. అంతేకాదు ఊబకాయానికి కారణం అవుతుందన్నారు. కాగా, స్నానం చేసిన తర్వాత అల్పాహారం తీసుకుంటే మెదడు చురుగ్గా పని చేసి.. ఎంత ఆహారం తీసుకుంటున్నామో సరిగ్గా అంచనా వేస్తుందని వైద్యులు చెప్పారు. కాబట్టి స్నానం తర్వాతే అల్పాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.