Zodiac Signs: మీ కలలో చేపలను చూస్తున్నారా? మీరు నిజంగా అదృష్టవంతులే..ఎందుకో తెలుసా..
Dream Science: మీకు కూడా తరచుగా కలలో చేపలు కనిపిస్తుంటాయా? అలాంటి కలలకు అర్థం తెలుసా? కాకపోతే, అలా కలలో చేపలు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం..

Astrology Tips: మనిషి రాత్రి నిద్రపోయేటప్పుడు కలలు కంటాడు. తెల్లవారుజామున అయోమయంగా లేస్తాడు. ఆ రాత్రి తాను చూసిన కలలో ఏదైనా అర్థం ఉందా..? లేదా..? కేవలం ఆలోచన మాత్రమేనా..! అని అతను ఆశ్చర్యపోతాడు. అతని ప్రశ్నకు సమాధానం కలలో ఏదో దాగి ఉంది. అయితే కలల శాస్త్రంలో కలలో కనిపించే అన్ని విషయాలకు అర్థం వివరించబడింది. మీ కలలో చేపలు కనిపిస్తే దాని అర్థం ఏమిటో ఈ రోజు మనం తెలుసుకుందాం..
మీరు చేపలతో ఈత కొడుతున్నట్లు..
మీరు కలలో కనిపిస్తే, ఇది ఆనందానికి సంకేతం. స్వప్న శాస్త్రం ప్రకారం, అలాంటి కలలు మీ ఆర్ధిక స్థితి మెరుగు పడుతుందని అర్థం. అతి కొద్ది రోజుల్లో మీ కెరీర్, సంపదకు సంబంధించిన శుభవార్త ఉండవచ్చు. మీరు ఏదైనా ఆస్తిలో పెట్టుబడి పెట్టవచ్చు.
స్విమ్మింగ్ ఫిష్..
మనలో చాలా మందికి ఇలాంటి కలలు కొన్నిసార్లు వస్తుంటాయి. ఇందులో తాను ఈత కొడుతున్నప్పుడు మిమ్మల్ని కొన్ని చేపలు పదే పదే తాకాలని చూస్తున్నట్లుగా కలలు కంటారు. దీని అర్థం.. అవి మీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాయని అర్థం. స్వప్న శాస్త్రం ప్రకారం.. అలాంటి కలలు శుభప్రదంగా పరిగణించబడతాయి. హిందూమతంలో చేపను లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. మీకు కలలో చేప పదే పదే తాకినట్లు కనిపిస్తే లక్ష్మి దేవి మీ ఇంటికి వస్తున్నట్లు అర్థం.
కలలో కనిపించే రంగుల చేపలు..
కొందరికి కలలో రంగురంగుల చేపలు కనిపిస్తాయి. ఆ చేపలు మందలుగా, నీటిలో ఉల్లాసంగా కనిపిస్తాయి. మీ జీవితం ఇప్పుడు సంతోషంగా సాగుతుందని అర్థం. నిలిచిపోయిన మీ పనులు పూర్తవుతాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఈ కలలు మీరు అనారోగ్యం.. కోర్టు-ఆఫీస్ ఒత్తిడి నుంచి బయటపడతారని కూడా సూచిస్తున్నాయి.
డ్రీమ్ శాస్త్రం ప్రకారం, మీరు మీ కలలో పదేపదే ఈత కొడుతున్న చేపలను చూస్తున్నట్లయితే. కనుక ఇది మంచి సంకేతం. అంటే, త్వరలో మీ ఇంట్లో కొన్ని శుభ కార్యాలు జరగబోతున్నాయి. మీ ఇంట్లో పిల్లల పుట్టుక, పిల్లల వివాహం, కెరీర్ ప్రారంభం వంటి పనులు ఉండవచ్చు. అలాంటి కలలు కనేవారి ఇంట్లో శుభ కార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ జ్ఞానం, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. TV9 న్యూస్ దానిని నిర్దారించదు.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం