ఏపీ ప్రయోజనాల సాధనకు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష విజయవంతం అయ్యింది. పలువురు ప్రముఖ నాయకులు సంఘీభావం తెలిపుతూ మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవగౌడలతో పాటు రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, శరద్ యాదవ్, శరద్ పవార్, ములాయం సింగ్, పలువురు ఎంపీలు వచ్చారు. అందరూ ఏపీకి అన్యాయం జరిగిందని, న్యాయం జరగాలని ఆకాంక్షించారు. అయితే ఈ ఒక్కరోజు ధర్మ పోరాట దీక్షలో చంద్రబాబు చేసిన ముగింపు ప్రసంగం హైలెట్‌గా నిలిచింది. […]
ఏపీ ప్రయోజనాల సాధనకు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష విజయవంతం అయ్యింది. పలువురు ప్రముఖ నాయకులు సంఘీభావం తెలిపుతూ మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవగౌడలతో పాటు రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, శరద్ యాదవ్, శరద్ పవార్, ములాయం సింగ్, పలువురు ఎంపీలు వచ్చారు. అందరూ ఏపీకి అన్యాయం జరిగిందని, న్యాయం జరగాలని ఆకాంక్షించారు.
అయితే ఈ ఒక్కరోజు ధర్మ పోరాట దీక్షలో చంద్రబాబు చేసిన ముగింపు ప్రసంగం హైలెట్‌గా నిలిచింది. ఆయన భావోద్వేగంగా హోదా సాధనకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఉన్న నాయకులంతా సంఘీభావం తెలిపేందుకు వచ్చినందుకు 5 కోట్ల ఆంధ్రుల తరుపున కృతజ్ఞతలని చెప్పారు. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజని దీక్షకు లభించిన మద్దతు చూసి తనకు ఊరట కలిగిందని, ఇప్పుడొక నమ్మకం వచ్చిందని చంద్రబాబు అన్నారు.
ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి దీక్షలో పాల్గొన్నారని, ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చి తీరతామని భరోసా ఇస్తూ మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి విజ్ఞాపన పత్రం కూడా అందజేస్తామని చంద్రబాబు తెలిపారు.