ప్రధాని మోడీ ఉండగానే.. రంగు బయటపడింది

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 7:41 PM

త్రిపురలో ఓ దుశ్చర్య బయటపడింది. ఎదురుగా ప్రధానిమోడీ ఉన్నారని మర్చిపోయి మరీ తోటి మంత్రి పట్ల వేధింపులకు పాల్పడుతున్న దృశ్యం కెమెరాకు చిక్కింది. వివరాల్లోకి వెళ్తే.. గత శనివారం త్రిపుర రాజధాని అగర్తలలో జరిగిన ప్రాజెక్టు శంకుస్థాపనలో ప్రధాని మోడీతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లాబ్ కుమార్ దేబ్, పలువురు బీజేపీ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు శంకుస్థాపనలో భాగంగా ప్రధాని మోడీ, పలువురు మంత్రులు పనిలో నిమగ్నమై ఉండగా.. అక్కడే ఉన్న రాష్ట్ర […]

ప్రధాని మోడీ ఉండగానే.. రంగు బయటపడింది

త్రిపురలో ఓ దుశ్చర్య బయటపడింది. ఎదురుగా ప్రధానిమోడీ ఉన్నారని మర్చిపోయి మరీ తోటి మంత్రి పట్ల వేధింపులకు పాల్పడుతున్న దృశ్యం కెమెరాకు చిక్కింది. వివరాల్లోకి వెళ్తే.. గత శనివారం త్రిపుర రాజధాని అగర్తలలో జరిగిన ప్రాజెక్టు శంకుస్థాపనలో ప్రధాని మోడీతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లాబ్ కుమార్ దేబ్, పలువురు బీజేపీ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు శంకుస్థాపనలో భాగంగా ప్రధాని మోడీ, పలువురు మంత్రులు పనిలో నిమగ్నమై ఉండగా.. అక్కడే ఉన్న రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మనోజ్ కాంతి దేవ్ పక్కనే ఉన్న తోటి మహిళా మంత్రిని అసభ్యంగా తాకాడు.

ఇప్పుుడు ఈ వార్త కాస్తా.. సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. వివాస్పదంగా మారింది. ఈ విషయంపై మంత్రిని స్పందిచాలని కోరగా.. ఆయన నిరాకరించారు. ఈ ఘటనతో మంత్రి మనోజ్ కాంతి దేవ్ ను తొలగించాలంటూ ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. కానీ.. బీజేపీ నేతలు మాత్రం ఇది ప్రతిపక్షాల కుట్ర అని తీసి పారేశారు. ఈ నేపథ్యంలో ఆ మహిళా మంత్రి కూడా స్పందించకపోవడం విడ్డూరంగా ఉంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu