పబ్‌జీ కాదు.. మరో కొత్త గేమ్

స్మార్ట్‌ ఫోన్ల వాడకం పెరుగుతున్న కొద్దీ.. ఆన్‌లైన్ వీడియో గేమ్‌లకు ప్రాచుర్యం పెరుగుతోంది. మొన్నటికి మొన్న వచ్చిన పబ్‌ జీ సంచలనం ఇంకా కొనసాగుతుండగా.. తాజాగా మరో కొత్త గేమ్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అపెక్స్ లెజెండ్స్ అనే పేరుతో వచ్చిన ఈ వీడియో గేమ్‌ను అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్స్ ఆర్ట్స్ అనుబంధ సంస్థ స్టూడియో రెస్పాన్ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందించింది. ఫిబ్రవరి 4న విడుదలైన ఈ గేమ్ ప్లేయర్ల సంఖ్య ఇప్పటికే రెండు కోట్లకు పైగా దాటిందని.. […]

పబ్‌జీ కాదు.. మరో కొత్త గేమ్

స్మార్ట్‌ ఫోన్ల వాడకం పెరుగుతున్న కొద్దీ.. ఆన్‌లైన్ వీడియో గేమ్‌లకు ప్రాచుర్యం పెరుగుతోంది. మొన్నటికి మొన్న వచ్చిన పబ్‌ జీ సంచలనం ఇంకా కొనసాగుతుండగా.. తాజాగా మరో కొత్త గేమ్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అపెక్స్ లెజెండ్స్ అనే పేరుతో వచ్చిన ఈ వీడియో గేమ్‌ను అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్స్ ఆర్ట్స్ అనుబంధ సంస్థ స్టూడియో రెస్పాన్ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందించింది.

ఫిబ్రవరి 4న విడుదలైన ఈ గేమ్ ప్లేయర్ల సంఖ్య ఇప్పటికే రెండు కోట్లకు పైగా దాటిందని.. దాదాపు 10లక్షల మంది ఒకేసారి గేమ్‌లోకి లాగిన్ అవుతున్నారని గేమ్ తయారీ సంస్థ పేర్కొంది. ఇక ప్రస్తుతం ఈ గేమ్ కేవలం ఎక్స్‌బాక్స్, పీఎస్4, పీసీల్లోనే అందుబాటులో ఉందని.. దీని మొబైల్ వెర్షన్ త్వరలో మార్కెట్‌లోకి తీసుకువస్తామని వారు అంటున్నారు.

Published On - 1:43 pm, Tue, 12 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu