రోజంతా కోర్టులో ఓ మూలన కూర్చోండి

సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురైయ్యారు సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వర్ రావు. కోర్టు ధిక్కారణకు పాల్పడినందుకు సుప్రీంకోర్టు వింత శిక్షను విధించింది. కోర్టులో రోజంతా ఓ మూలన కూర్చోమంటూ, అలాగే రూ.లక్ష ఫైన్ కట్టాలంటూ చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ ఆదేశించారు. బీహార్ లో ఓ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారిని బదిలీ చేయడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం అనుమతి లేకుండా ఎలా బదిలీ చేస్తారంటూ చురకలంటించింది. నాగేశ్వర్ రావు క్షమాపణలు చెప్పినా సుప్రీం […]

రోజంతా కోర్టులో ఓ మూలన కూర్చోండి
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 6:33 PM

సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురైయ్యారు సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వర్ రావు. కోర్టు ధిక్కారణకు పాల్పడినందుకు సుప్రీంకోర్టు వింత శిక్షను విధించింది. కోర్టులో రోజంతా ఓ మూలన కూర్చోమంటూ, అలాగే రూ.లక్ష ఫైన్ కట్టాలంటూ చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ ఆదేశించారు. బీహార్ లో ఓ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారిని బదిలీ చేయడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం అనుమతి లేకుండా ఎలా బదిలీ చేస్తారంటూ చురకలంటించింది. నాగేశ్వర్ రావు క్షమాపణలు చెప్పినా సుప్రీం తిరస్కరించింది. నాకు నచ్చిందే చేస్తా అన్న ఆయన వైఖరిని మార్చుకోవాలని తెలిపింది. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మను బదిలీ చేయడం తన తప్పేనని నాగేశ్వర్ రావు క్షమాపణలు అడిగారు. అలాగే.. కోర్టు ఆదేశాలను ధిక్కరించే ఉద్దేశం తనకు లేదని అన్నారు.