మాఘ మాస విశేషం

హిందు సంప్రదాయంలో మాఘ మాసానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ నెల రోజులు నియమ నిష్టలతో స్నానాలు, వ్రతాలు చేయడం, పురాణము విన్నా జన్మ జన్మల పాపాలు నశిస్తాయని ఆర్యోక్తి. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, తిలదానం ముఖ్యమైనవి. శుద్ధ విదియ నాడు బెల్లం, ఉప్పు దానంగా ఇవ్వడం మంచిది, ఈ మాసంలో నదీ స్నానం అత్యంత శ్రేష్టం. మాఘమాసంలో ఒకసారి ఉషోదయ స్నానం చేస్తే పుణ్యఫలమని, నెలంతా లభించే ఫలితం గొప్పదని చెబుతారు. […]

మాఘ మాస విశేషం

హిందు సంప్రదాయంలో మాఘ మాసానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ నెల రోజులు నియమ నిష్టలతో స్నానాలు, వ్రతాలు చేయడం, పురాణము విన్నా జన్మ జన్మల పాపాలు నశిస్తాయని ఆర్యోక్తి.

ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, తిలదానం ముఖ్యమైనవి. శుద్ధ విదియ నాడు బెల్లం, ఉప్పు దానంగా ఇవ్వడం మంచిది, ఈ మాసంలో నదీ స్నానం అత్యంత శ్రేష్టం. మాఘమాసంలో ఒకసారి ఉషోదయ స్నానం చేస్తే పుణ్యఫలమని, నెలంతా లభించే ఫలితం గొప్పదని చెబుతారు.

వశిష్ఠ మహర్షి మాఘస్నానం వల్ల కలిగే ఫలితాన్ని ఈ విధంగా వివరించాడు.  ఓ గంధర్వుడికి మాఘస్నానం చేయగానే ఆయన మనస్తాపం తీరిపోయిందన్నాడు. అతడికి అన్నీ సక్రమంగానే ఉన్నా గతజన్మలో కర్మ ఫలితంగా ముఖం వికారంగా ఉండేది. దీంతో, అతడు భృగుమహర్షి వద్దకు వెళ్లిన తన గోడు వెళ్లబోసుకున్నాడు. సిరి సంపదలు, శక్తులు ఉన్నా వదనం మాత్రం పులి ముఖాన్ని తలపించేలా వికారంగా ఉందని, పరిష్కారం చెప్పమని అడిగాడు. గంధర్వుడి వ్యథ విన్న మహర్షి, మాఘమాసం ప్రారంభమైందని వెంటనే వెళ్లి గంగానదిలో స్నానం చేయమని సూచించాడు. ఈ పవిత్ర స్నానంతో చేసిన పాపాలు, దాని వల్ల కలిగిన ఇబ్బందులు తొలగిపోతాయని తెలిపాడు.

Published On - 9:00 pm, Mon, 11 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu