శారదా స్కాం పర్యవేక్షణకు సుప్రీం తిరస్కరణ

శారదా కుంభకోణం కేసులో మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించాలని దాఖలైన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్ధానం కొట్టివేసింది. కేసులో పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యం లేదని తెల్చి చెప్పింది. వివాదస్పద కోల్‌కత్తా పోలీసు కమిషనర్ రాజీవ్‌కుమార్, టీఎంసీ మాజీ ఎంపీ కునాల్ ఘోష్‌ను సీబీఐ పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా అనేక కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. శనివారం దాదాపు 9 గంటల సేపు రాజీవ్ కుమార్‌ను […]

శారదా స్కాం పర్యవేక్షణకు సుప్రీం తిరస్కరణ

శారదా కుంభకోణం కేసులో మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించాలని దాఖలైన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్ధానం కొట్టివేసింది. కేసులో పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యం లేదని తెల్చి చెప్పింది. వివాదస్పద కోల్‌కత్తా పోలీసు కమిషనర్ రాజీవ్‌కుమార్, టీఎంసీ మాజీ ఎంపీ కునాల్ ఘోష్‌ను సీబీఐ పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా అనేక కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. శనివారం దాదాపు 9 గంటల సేపు రాజీవ్ కుమార్‌ను సీబీఐ అధికారులు విచారించారు. ఈ కేసులో ఆధారాలను కూడా సేకరించినట్లు తెలుస్తోంది. ఈ స్కాంపై రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో సిట్ బృందం గతంలో దర్యాప్తు చేసిన విషయం విదితమే. ఈ సిట్‌ను సీఎం మమతా బెనర్జీ ఏర్పాటు చేశారు. శారదా గ్రూప్‌ పేరుతో 200 ప్రయివేటు కంపెనీలు నడిపిన పొంజీ స్కీం దివాళా తీయడంతో కోటి 70 లక్షలమంది డిపాజిటర్ల బతుకులు రోడ్లమీద పడిన విషయం తెలిసిందే.

Published On - 8:47 pm, Mon, 11 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu