క్రెడిట్ కార్డు వాడుతున్నారా…
క్రెడిట్ కార్డు వినియోగం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. చేతిలో డబ్బులు లేనప్పుడు ఇవే బాసటగా నిలుస్తున్నాయి. అందుకేనేమో బ్యాంకుల క్రెడిట్ కార్డులు వినియోగించేవారి సంఖ్య ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకుంది. సిబిల్ తాజా నివేదికలోనూ ఇదే విషయం వెల్లడైంది. సిబిల్ 2018 మూడో త్రైమాసికపు నివేదిక ప్రకారం… క్యూ3లో బ్యాంకుల క్రెడిట్ కార్డులను వినియోగించే వారి సంఖ్య 3.69 కోట్లకు చేరింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి కావడం గమనార్హం. వార్షిక ప్రాతిపదికన చూస్తే 31.7 శాతం వృద్ధి నమోదయ్యింది. ఈ డిమాండ్‌కు తగినట్లుగానే బ్యాంకులు […]

క్రెడిట్ కార్డు వినియోగం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. చేతిలో డబ్బులు లేనప్పుడు ఇవే బాసటగా నిలుస్తున్నాయి. అందుకేనేమో బ్యాంకుల క్రెడిట్ కార్డులు వినియోగించేవారి సంఖ్య ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకుంది. సిబిల్ తాజా నివేదికలోనూ ఇదే విషయం వెల్లడైంది.
సిబిల్ 2018 మూడో త్రైమాసికపు నివేదిక ప్రకారం… క్యూ3లో బ్యాంకుల క్రెడిట్ కార్డులను వినియోగించే వారి సంఖ్య 3.69 కోట్లకు చేరింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి కావడం గమనార్హం. వార్షిక ప్రాతిపదికన చూస్తే 31.7 శాతం వృద్ధి నమోదయ్యింది. ఈ డిమాండ్‌కు తగినట్లుగానే బ్యాంకులు కూడా దూకుడుగా క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. క్రెడిట్ స్కోరు దెబ్బతినకుండా ఆ కార్డులను వినియోగించుకోవడమనేది చాలా ముఖ్యమైన అంశం.