అసోంలో దారుణం.. కల్తీ సారా కాటుకు 69 మంది బలి
అసోం : కల్తీ సారా కాటుకు అసోంలో 69 మంది బలయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. తూర్పు అసోం గోలాఘాట్ జిల్లాలోని టీ తోటల్లో పనిచేస్తున్న వంద మందికి పైగా కూలీలు గురువారం రాత్రి నాటు సారా తాగారు. కొద్దిసేపటికే చాలామంది అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన గోలాఘాట్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే 12 మంది మృతి చెందారు. చికిత్స పొందుతూ మరో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన […]
అసోం : కల్తీ సారా కాటుకు అసోంలో 69 మంది బలయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. తూర్పు అసోం గోలాఘాట్ జిల్లాలోని టీ తోటల్లో పనిచేస్తున్న వంద మందికి పైగా కూలీలు గురువారం రాత్రి నాటు సారా తాగారు. కొద్దిసేపటికే చాలామంది అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన గోలాఘాట్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే 12 మంది మృతి చెందారు. చికిత్స పొందుతూ మరో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన పలువురిని జోర్హాత్ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.