ఏపీ డిజీపీ పేరిట ట్విటర్ అకౌంట్.. వెంటనే ఫాలో అయిన ఎస్పీలు, ఇంతలో ఊహించని పరిణామం
సైబర్ నేరగాళ్ల ఏపీ పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్‌ను టార్గెట్ చేశారు. ‘డీజీపీ ఆంధ్రప్రదేశ్’ పేరిట గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం....
సైబర్ నేరగాళ్ల ఏపీ పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్‌ను టార్గెట్ చేశారు. ‘డీజీపీ ఆంధ్రప్రదేశ్’ పేరిట గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం ట్విటర్‌లో ఫేక్ ఖాతాను ఓపెన్ చేశారు. దానికి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఫోటోను డీపీకా పెట్టారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ అధికారిక ఖాతా ఇదేనని ట్విటర్ హ్యాండిల్‌లో రాసుకొచ్చారు. అనంతరం సదరు అకౌంట్ నుంచి వరుస ట్వీట్లు వచ్చాయి. అది ఫేక్ అకౌంట్ అనే విషయం గుర్తించకుండా పలు జిల్లాల ఎస్పీలు, ఇతర పోలీసులు ఈ ట్విటర్ ఖాతాను అనుసరించారు. అయితే ట్వీట్లు అనుమానాస్పదంగా ఉండటంతో.. క్రాస్ చెక్ చేయడంతో ఫేక్ అకౌంట్ అని తేలింది. విషయం తెలిసిన వెంటనే పోలీసు ప్రధాన కార్యాలయం ట్విటర్‌కు ఫిర్యాదు చేసి ఈ ఖాతాను బ్లాక్ చేయించింది. ఈ అంశంపై విజయవాడలోని సైబర్ నేరాల పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.
ఏ ఐపీ చిరునామా నుంచి ఈ నకిలీ అకౌంట్ ప్రారంభించారు? దీని వెనక ఎవరున్నారు? ఆకతాయిల పనా? లేక దురుద్దేశాలేవైనా ఉన్నాయా? అనే అంశాలపై సైబర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా రాష్ట్ర డీజీపీ పేరుతోనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం చర్చనీయాంశం అయ్యింది.
Also Read: తిప్పతీగతో అతడి లక్ తిరిగింది.. ఇప్పుడు ఏకంగా కోట్లు సంపాదిస్తున్నాడు