సీపీఐ రామకృష్ణకు కర్నూలు షాక్
మూడు రాజధానుల ఫార్ములాను వ్యతిరేకిస్తూ.. చంద్రబాబుతో కలిసి ఉద్యమిస్తున్న సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు సొంత పార్టీ నుంచే ఊహించని షాక్ తగిలింది. అది కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయలసీమ ప్రాంత నేతల నుంచే షాక్ తగలడంతో రామకృష్ణ అవాక్కయ్యారని సమాచారం. ఏపీకి మూడు రాజధానులంటూ లీకేజీలు మొదలైనప్పట్నించి.. ప్రస్తుత ఉద్యమం దాకా సీపీఐ రామృష్ణ తొలుత పవన్ కల్యాణ్‌తోను ఆ తర్వాత చంద్రబాబుతోను చట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు. చంద్రబాబు బస్సుయాత్ర, భిక్షాటన ఎక్కడ కొనసాగినా […]
మూడు రాజధానుల ఫార్ములాను వ్యతిరేకిస్తూ.. చంద్రబాబుతో కలిసి ఉద్యమిస్తున్న సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు సొంత పార్టీ నుంచే ఊహించని షాక్ తగిలింది. అది కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయలసీమ ప్రాంత నేతల నుంచే షాక్ తగలడంతో రామకృష్ణ అవాక్కయ్యారని సమాచారం.
ఏపీకి మూడు రాజధానులంటూ లీకేజీలు మొదలైనప్పట్నించి.. ప్రస్తుత ఉద్యమం దాకా సీపీఐ రామృష్ణ తొలుత పవన్ కల్యాణ్‌తోను ఆ తర్వాత చంద్రబాబుతోను చట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు. చంద్రబాబు బస్సుయాత్ర, భిక్షాటన ఎక్కడ కొనసాగినా ఆయన పక్కనే రామకృష్ణ దర్శనమిస్తున్నారు. పవన్ కల్యాణ్ ప్రత్యక్ష ఆందోళనకు ఇంకా సిద్దపడకపోవడంతో రామకృష్ణ టీడీపీ అధినేతతో కలిసి రోడ్డెక్కారు.
ఇంత వరకు బాగానే వున్నా.. సోమవారం సీపీఐ రామకృష్ణకు ఊహించని షాక్ తగిలింది. అమరావతి రాజధానికి మద్దతిస్తున్న రామకృష్ణ అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ వాసుల డిమాండ్‌ను పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నారని ఆరోపిస్తూ.. సీపీఐ కర్నూలు జిల్లా కమిటీ తీర్మానం చేసింది. రామకృష్ణ తీరుపై కర్నూలు సీపీఐ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా కమిటీ తీర్మానాన్ని పార్టీ అధిష్టానానికి పంపిస్తామని స్థానిక నేతలు చెబుతున్నారు.