బిచ్చగాని గెటప్ అదిరింది బాబూ! కొడాలి కాంప్లిమెంట్
ఏపీ మంత్రి, హైపవర్ కమిటీ సభ్యుడు కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంక్రాంతికి బిచ్చగాని గెటప్ వేసిన చంద్రబాబు… రాజధాని అంశంతో రాజకీయ పబ్బం గడుపు కోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ నాని రెచ్చిపోయారు. సోమవారం జరిగిన హైపవర్ కమిటీ సమావేశం తర్వాత కొడాలి నాని టీవీ9తో మాట్లాడారు. చంద్రబాబు, లోకేశ్‌లపై వ్యంగ్యోక్తులు విసిరారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ భావనలు గట్టిగా వున్నందున అన్ని ప్రాంతాలను సమాన స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా వుందని, […]
ఏపీ మంత్రి, హైపవర్ కమిటీ సభ్యుడు కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంక్రాంతికి బిచ్చగాని గెటప్ వేసిన చంద్రబాబు… రాజధాని అంశంతో రాజకీయ పబ్బం గడుపు కోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ నాని రెచ్చిపోయారు. సోమవారం జరిగిన హైపవర్ కమిటీ సమావేశం తర్వాత కొడాలి నాని టీవీ9తో మాట్లాడారు. చంద్రబాబు, లోకేశ్‌లపై వ్యంగ్యోక్తులు విసిరారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ భావనలు గట్టిగా వున్నందున అన్ని ప్రాంతాలను సమాన స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా వుందని, ఈ విషయం చంద్రబాబుకు బోధపడడం లేదని కొడాలి నాని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కొడాలి నాని… ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి హైదరాబాద్ నుంచి చంద్రబాబు పారిపోయి అమరావతికి వచ్చారని ఎద్దేవా చేశారు. తాను చేసిన పాపాలకు అడుక్కునే పరిస్థితికి చంద్రబాబు చేరుకున్నారన్నారు. సంక్రాంతికి బిచ్చగాడి వేషం వేసిన చంద్రబాబు వీథుల్లో అడుక్కుంటున్నారని విమర్శించారు.
జగన్ దెబ్బకు ఏమి చెయ్యాలో పాలుపోక చంద్రబాబు పగటి వేషగాడిలా మారిపోయారన్నారు. నారా లోకేశ్ తమ పార్టీకి 60 లక్షల సభ్యత్వం వుందని చెబుతున్నా.. టీడీపీ సమావేశాలకు 500 మంది కూడా రావడం లేదని నాని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. తనకు నిత్యం రక్షణ ఇచ్చే పోలీసుల్ని సిగ్గులేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చంద్రబాబును విమర్శించారు నాని. హైపవర్ కమిటీకి గుడివాడ ప్రాంత ప్రజల అభిప్రాయాలను తెలియజేశానని చెప్పుకొచ్చారు మంత్రి నాని.