షాకింగ్ న్యూస్.. చాపకింద నీరులా ఐఎస్ నెట్‌వర్క్..! అది కూడా దక్షిణాది రాష్ట్రాల్లో..

ఐఎస్.. ఇది ప్రపంచాన్ని ఇస్లామిక్‌గా మార్చుతామంటూ.. విధ్వంసం సృష్టించే ఉగ్రసంస్థ. దీని ఎఫెక్ట్‌ అనేక దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మన దేశంలో కూడా రాబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దాడులు జరిపేందుకు.. ఇస్లామిక్ ఉగ్రవాదులు పక్కాప్లాన్‌లు రచించారు. దేశంలో అలజడి సృష్టించేందుకు అయిదుగురు ఐఎస్ ఉగ్రవాదులు ఎంటర్ అయ్యారని.. ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన ఢిల్లీ పోలీసులు.. అన్ని చోట్లు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురు ఐఎస్ ఉగ్రవాదులను […]

షాకింగ్ న్యూస్.. చాపకింద నీరులా ఐఎస్ నెట్‌వర్క్..! అది కూడా దక్షిణాది రాష్ట్రాల్లో..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 13, 2020 | 1:47 PM

ఐఎస్.. ఇది ప్రపంచాన్ని ఇస్లామిక్‌గా మార్చుతామంటూ.. విధ్వంసం సృష్టించే ఉగ్రసంస్థ. దీని ఎఫెక్ట్‌ అనేక దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మన దేశంలో కూడా రాబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దాడులు జరిపేందుకు.. ఇస్లామిక్ ఉగ్రవాదులు పక్కాప్లాన్‌లు రచించారు. దేశంలో అలజడి సృష్టించేందుకు అయిదుగురు ఐఎస్ ఉగ్రవాదులు ఎంటర్ అయ్యారని.. ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన ఢిల్లీ పోలీసులు.. అన్ని చోట్లు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురు ఐఎస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరికోసం గాలింపు చేపడుతున్నారు. అయితే అరెస్ట్ అయిన ముగ్గురు ఉగ్రవాదులను విచారిస్తుండగా అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇప్పటికే వారిచ్చిన సమాచారంతో పలువురు అనుమానితుల్ని అరెస్ట చేశారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఐఎస్ నెట్‌వర్క్ వ్యాపించిందని.. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఐఎస్ లింకులు ఉన్నట్లు వెల్లడైంది.

మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడులలో ఐఎస్ సానుభూతిపరులు.. అనేక మార్లు సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నట్లు.. విచారణలో తేలిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దాదాపు 11మంది ఐఎస్ మాడ్యూల్‌తో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు గుర్తించామని.. త్వరలో వీరిని అరెస్ట్ చేస్తామని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. వీరందరి కీలక సూత్రదారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపడుతున్నాయని.. ఇప్పటికే గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో వెతుకుతున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో ఇటీవల తమిళనాడులో ఓ ఎస్ఐని కాల్చి చంపిన ఘటనలో ఐఎస్ పాత్ర ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. తమిళనాడు, కేరళ సరిహద్దులో ఉన్న.. కన్యాకుమారి జిల్లా కాళియక్కావళిలో.. బుధవారం (జనవరి 9) రాత్రి 10 గంటల సమయంలో చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేస్తున్న ఓ ఎస్‌ఐని దుండగులు కాల్చి చంపారు.ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎస్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు ఉగ్రవాద మూలాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు పోలీసులు. అయితే తాజాగా ఢిల్లీలో పట్టుబడిన ఉగ్రవాదులను విచారించగా.. షమీమ్, తౌఫిక్ అనే ఇద్దరు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. ఘటన అనంతరం వారు ఎక్కడికి పారిపోయి ఉండొచ్చన్న దానిపై ఆరా తీస్తున్నారు. మొత్తానికి.. పట్టుబడ్డ ఉగ్రవాదులను విచారిస్తే.. ఐఎస్ లింకులు దక్షిణాది రాష్ట్రాలకు కూడా విస్తరించాయని తేలింది.