AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ పార్టీకి నాలుగు పార్టీల ఝలక్ ! ఆ మీటింగ్‌కి గైర్హాజర్ !

జేఎన్‌యు ఘటన, సీఏఏపై దేశంలో వెల్లువెత్తిన నిరసనలతో సహా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ ఆధ్వర్యాన సోమవారం ప్రతిపక్షాల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావలసిందిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆయా విపక్షాలకు లేఖలు రాశారు. అయితే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ‘ఆప్’, మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ, మహారాష్ట్ర లోని శివసేన ఈ సమావేశానికి హాజరు కావడంలేదని […]

కాంగ్రెస్ పార్టీకి నాలుగు పార్టీల ఝలక్ ! ఆ మీటింగ్‌కి గైర్హాజర్ !
Umakanth Rao
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 13, 2020 | 1:19 PM

Share

జేఎన్‌యు ఘటన, సీఏఏపై దేశంలో వెల్లువెత్తిన నిరసనలతో సహా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ ఆధ్వర్యాన సోమవారం ప్రతిపక్షాల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావలసిందిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆయా విపక్షాలకు లేఖలు రాశారు. అయితే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ‘ఆప్’, మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ, మహారాష్ట్ర లోని శివసేన ఈ సమావేశానికి హాజరు కావడంలేదని ప్రకటించాయి. ఈ మీటింగ్‌కి తమకు ఆహ్వానం అందలేదని, అందువల్ల తాము రావడంలేదని సేన వర్గాలు వెల్లడించాయి.

ఇక రాజస్తాన్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వానికి తాము బయటినుంచి మద్దతు తెలిపామని, అయితే రెండోసారి కాంగ్రెస్ నేతలు మా పార్టీవారిని తమ పార్టీలో చేరాల్సిందిగా కోరారని మాయావతి తెలిపారు. ఇది అనైతికమని ఆమె ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఎలా హాజరవుతామని ఆమె ప్రశ్నించారు. అయితే సీఏఏ, ఎన్నార్సీలకు మేం వ్యతిరేకమన్నారు. ఇక సీఏఏకి నిరసనగా కోల్‌కతాలో జరిగిన ‘భారత్ బంద్’ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తమను చిన్నచూపు చూసిందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కాగా- ఈ సమావేశానికి ఎన్సీపీ, డీఎంకే, ఐయుఎంఎల్, లెఫ్ట్, ఆర్జేడీ వంటి పార్టీలు హాజరవుతున్నాయి.

టూరిస్టులు ఎగిరి గంతేసే న్యూస్..! జనవరిలో విశాఖలో పండగే పండగ..
టూరిస్టులు ఎగిరి గంతేసే న్యూస్..! జనవరిలో విశాఖలో పండగే పండగ..
పగటి నిద్రతో కలిగే అద్భుత ప్రయోజనాలు!
పగటి నిద్రతో కలిగే అద్భుత ప్రయోజనాలు!
హైదరాబాద్‌లో తొలి తరహా లగ్జరీ మేకప్ స్టూడియో..
హైదరాబాద్‌లో తొలి తరహా లగ్జరీ మేకప్ స్టూడియో..
నెల్లూరు లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. కడప జైలుకు తరలింపు
నెల్లూరు లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. కడప జైలుకు తరలింపు
హృతిక్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. టీమిండియా తోపు క్రికెటర్ భార్య
హృతిక్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. టీమిండియా తోపు క్రికెటర్ భార్య
గుండెకు హాని చేసే ఆహారాలు.. ఈ 5 రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండండి!
గుండెకు హాని చేసే ఆహారాలు.. ఈ 5 రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండండి!
టేస్టీగా ఉన్నాయని ఆ ఫుడ్స్ అతిగా తినేశారంటే.. మీ కిడ్నీ షెడ్డుకే
టేస్టీగా ఉన్నాయని ఆ ఫుడ్స్ అతిగా తినేశారంటే.. మీ కిడ్నీ షెడ్డుకే
అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌‌కు నాగార్జున వార్నింగ్
అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌‌కు నాగార్జున వార్నింగ్
రెండు రోజుల పాటు యూపీఐ సర్వీసులు బంద్.. బ్యాంకు కస్టమర్లకు అలర్ట్
రెండు రోజుల పాటు యూపీఐ సర్వీసులు బంద్.. బ్యాంకు కస్టమర్లకు అలర్ట్