గాంధీ నుంచి కరోనా బాధితుడు డిశ్చార్జ్..

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Mar 15, 2020 | 8:50 AM

COVID 19: తెలంగాణలో తొలి కరోనా బాధితుడు గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇటీవల చేసిన కరోనా టెస్టులు నెగటివ్ రావడంతో వైద్యులు అతన్ని డిశ్చార్జ్ చేశారు. నగరంలోని మహేంద్రా హిల్స్‌కు చెందిన సదరు వ్యక్తికి మార్చి 1న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో అతడు చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రిలో చేరాడు. అప్పటి నుంచి సుమారు 9 రోజుల పాటు గాంధీలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకోగా.. తాజాగా చేసిన కరోనా టెస్టుల్లో […]

గాంధీ నుంచి కరోనా బాధితుడు డిశ్చార్జ్..


COVID 19: తెలంగాణలో తొలి కరోనా బాధితుడు గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇటీవల చేసిన కరోనా టెస్టులు నెగటివ్ రావడంతో వైద్యులు అతన్ని డిశ్చార్జ్ చేశారు. నగరంలోని మహేంద్రా హిల్స్‌కు చెందిన సదరు వ్యక్తికి మార్చి 1న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో అతడు చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రిలో చేరాడు.

అప్పటి నుంచి సుమారు 9 రోజుల పాటు గాంధీలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకోగా.. తాజాగా చేసిన కరోనా టెస్టుల్లో కరోనా నెగటివ్‌గా నిర్ధారణ కావడంతో వైద్యులు అతడిని డిశ్చార్జ్ చేశారు. ఇక దీనిపై స్పందించిన ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు. కరోనా సోకిన వ్యక్తిని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి పంపించడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం తెలంగాణాలో ఒక్క వ్యక్తికీ కూడా కరోనా పాజిటివ్ లేదని స్పష్టం చేశారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

కాగా, కరోనా వైరస్ మహమ్మారి 136 దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడి 5,374 మంది మృతి చెందారు. అంతేకాక 1,42,775 కేసులు నమోదయ్యాయి. ఇక చైనాలో 3,177, ఇటలీలో 1,016, ఇరాన్‌లో 514 మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా వల్ల ఇటలీ ఆర్ధిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది.

For More News:

భారత్ లో రెండో కరోనా మరణం…

ఏపీలో కరోనా అలెర్ట్.. పాఠశాలలు, థియేటర్లు బంద్..

దోపిడీలు.. బెదిరింపులు.. భూకబ్జాలు.. రేవంత్ ‘మిస్టర్ అరాచక్’!

జనసేన ఆవిర్భావ రోజు.. నిరాశలో కార్యకర్తలు..

వాహనదారులకు కేంద్రం షాక్.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు…

కరోనా ప్రభావం.. ఆసీస్, కివీస్ వన్డే సిరీస్ రద్దు..

గుడ్ న్యూస్.. కరోనా‌కు వ్యాక్సిన్ దొరికేసిందోచ్..

కివీస్ ఆటగాడికి కరోనా వైరస్.. ఆందోళనలో క్రికెట్ బోర్డు..

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి..

జగన్ సర్కార్‌కు ఈసీ షాక్.. ఎందుకంటే.?

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu