భారత్‌లో రెండో కరోనా మరణం…

Coronavirus Outbreak: భారత్‌లో రెండో కరోనా మరణం నమోదైంది. ఢిల్లీకి చెందిన 69 ఏళ్ల వృద్ధురాలు ఈ వైరస్ బారిన పడి మృతి చెందింది. ఈ మేరకు ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు. గతంలో ఆమెకు షుగర్, బీపీ ఉన్నాయని కూడా డాక్టర్లు తెలిపారు. ఇక ఇప్పటికే ఢిల్లీలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. అటు దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 82కు చేరుకుంది. ఇక ఇందులో ఇద్దరు చనిపోయారు. కర్ణాటకలో 76 ఏళ్ల  వృద్ధుడు […]

  • Updated On - 2:07 pm, Sat, 14 March 20
భారత్‌లో రెండో కరోనా మరణం…

Coronavirus Outbreak: భారత్‌లో రెండో కరోనా మరణం నమోదైంది. ఢిల్లీకి చెందిన 69 ఏళ్ల వృద్ధురాలు ఈ వైరస్ బారిన పడి మృతి చెందింది. ఈ మేరకు ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు. గతంలో ఆమెకు షుగర్, బీపీ ఉన్నాయని కూడా డాక్టర్లు తెలిపారు. ఇక ఇప్పటికే ఢిల్లీలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి.

అటు దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 82కు చేరుకుంది. ఇక ఇందులో ఇద్దరు చనిపోయారు. కర్ణాటకలో 76 ఏళ్ల  వృద్ధుడు రెండు రోజుల క్రితం కరోనా వైరస్ సోకి ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. కాగా, కేంద్రం ఈ మహమ్మారి దేశంలో విజృంభించకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఏప్రిల్ 15 వరకు అన్ని రకాల వీసాలను రద్దు చేసింది. అటు రాష్ట్రాలు కూడా దీన్ని నియంత్రించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కాగా, ఈ కరోనా వైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 వెల మంది మృతి చెందిన విషయం విదితమే.

For More News:

గుడ్ న్యూస్.. గాంధీ నుంచి కరోనా బాధితుడు డిశ్చార్జ్

ఏపీలో కరోనా అలెర్ట్.. పాఠశాలలు, థియేటర్లు బంద్..

దోపిడీలు.. బెదిరింపులు.. భూకబ్జాలు.. రేవంత్ ‘మిస్టర్ అరాచక్’!

జనసేన ఆవిర్భావ రోజు.. నిరాశలో కార్యకర్తలు..

వాహనదారులకు కేంద్రం షాక్.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు…

కరోనా ప్రభావం.. ఆసీస్, కివీస్ వన్డే సిరీస్ రద్దు..

గుడ్ న్యూస్.. కరోనా‌కు వ్యాక్సిన్ దొరికేసిందోచ్..

కివీస్ ఆటగాడికి కరోనా వైరస్.. ఆందోళనలో క్రికెట్ బోర్డు..

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి..

జగన్ సర్కార్‌కు ఈసీ షాక్.. ఎందుకంటే.?