మెక్రోసాఫ్ట్‌ నుంచి తప్పుకున్న బిల్ గేట్స్

మెక్రోసాఫ్ట్ కంపెనీ సహ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్ నుంచి తప్పుకుంటున్నట్లు తాజాగా ప్రకటించారు. ఎక్కువ సమయం సామాజిక సేవలకు..

మెక్రోసాఫ్ట్‌ నుంచి తప్పుకున్న బిల్ గేట్స్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 14, 2020 | 10:33 AM

మెక్రోసాఫ్ట్ కంపెనీ సహ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. డైరెక్టర్‌ల బోర్డు నుంచి తప్పుకుంటున్నట్లు తాజాగా ప్రకటించారు. ఎక్కువ సమయం సామాజిక సేవలకు వినియోగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో) సత్యనాదేళ్లతో పాటు కంపెనీలోని ఇతర సభ్యులకు సాంకేతిక సలహాదారుగా కొనసాగుతానని వెల్లడించారు.

కాగా.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో రెండోస్థానంలో ఉన్నారు బిల్ గేట్స్. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా పలు దేశాల్లో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్య, ఆర్థిక, ఉపాధి కల్పన రంగాల్లో ఈ ఫాండేషన్ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోంది.

Read More this also: రోజా ‘రచ్చబండ’కు దొరబాబు దంపతులు

షాకింగ్ న్యూస్: ఆస్ట్రేలియా క్రికెటర్‌కి కరోనా వైరస్..!

వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చూడాలనుకుంటున్నారా? ఈ ట్రిక్ యూజ్ చేయండి