షేక్ హ్యాండ్‌ వద్దు.. నమస్కారం ముద్దు!

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది కరోనా వైరస్.. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ నలుమూలలకి వ్యాపించి ప్రజలను భయబ్రాంతులకి గురి చేస్తుంది. ఇప్పుడు ప్రపంచమంతా షేక్‌ హ్యాండ్‌ మానేసి సంస్కారంగా నమస్కారం

  • Tv9 Telugu
  • Publish Date - 10:53 pm, Fri, 13 March 20
షేక్ హ్యాండ్‌ వద్దు.. నమస్కారం ముద్దు!

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది కరోనా వైరస్.. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ నలుమూలలకి వ్యాపించి ప్రజలను భయబ్రాంతులకి గురి చేస్తుంది. ఇప్పుడు ప్రపంచమంతా షేక్‌ హ్యాండ్‌ మానేసి సంస్కారంగా నమస్కారం చేస్తున్నారు. ఎదుటి వారిని పలకరించేందుకు భారతీయ సంస్కృతికి జై కొడుతున్నారు. పలువురు దేశాధినేతలు కూడా నమస్తే చెబుతూ భారతీయ సంస్కృతిని అందలమెక్కిస్తున్నారు. అగ్రరాజ్యం అధినేత ట్రంప్‌ తో మొదలు పెడితే ఇజ్రాయెల్‌ ప్రధాని,స్పెయిన్‌ రాజు, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు, బ్రిటన్‌ ప్రిన్స్ ఛార్లెస్ కూడా నమస్కారం చేస్తున్నారు. నమస్కారమే కరోనా కాటుకు విరుగుడంటున్నారు. కాగా.. కేరళలోని ఓ స్కూల్లో కరచాలనం కాకుండా నమస్కారానికి ఉన్న విలువలను ఇద్దరు బాలికలు చెప్పడం ఈ వీడియోలో కనిపిస్తుంది. మీరు ఓ లుక్కేయండి.