కరోనా వైరస్.. చైనా సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభావం తక్కువేనట..!
COVID 19: చైనాను అతలాకుతలం చేసిన కరోనా వైరస్.. ప్రస్తుతం భారత్‌లో పంజా విసురుతోంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కోవిడ్ 19 బాధితుల సంఖ్య 147కు చేరుకుంది. ఇదిలా ఉంటే కొన్ని రాష్ట్రాల్లో అయితే కరోనా ప్రభావం అసలు కనిపించలేదు. అది కూడా చైనాతో నేరుగా సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాపించకపోవడం […]
COVID 19: చైనాను అతలాకుతలం చేసిన కరోనా వైరస్.. ప్రస్తుతం భారత్‌లో పంజా విసురుతోంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కోవిడ్ 19 బాధితుల సంఖ్య 147కు చేరుకుంది.
ఇదిలా ఉంటే కొన్ని రాష్ట్రాల్లో అయితే కరోనా ప్రభావం అసలు కనిపించలేదు. అది కూడా చైనాతో నేరుగా సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాపించకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇండియాలో ఉన్న ఐదు రాష్ట్రాలకు చైనాతో సరిహద్దులు ఉన్న సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లకు చైనాతో సరిహద్దులు ఉన్నాయి. ఇవే కాకుండా చిన్న దేశాలైన నేపాల్, మయన్మార్, భూటాన్లలకు చైనాతో సరిహద్దులున్నాయి.
ఈ రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందలేదు. అంతేకాకుండా పశ్చిమబెంగాల్, అస్సాం, బిహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం వంటి రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం తక్కువగా ఉంది. దీనితో చైనాతో సరిహద్దు ఉన్నంత మాత్రాన ప్రమాదం పొంచి వస్తుందన్న వాదన కరెక్ట్ కాదని అర్ధమవుతోంది. కాగా, కేంద్ర ప్రభుత్వం కరోనాను కట్టడి చేసేందుకు విమానాశ్రయాల్లో తగిన జాగ్రత్తలు చేపడుతోంది.
For More News:
హైదరాబాద్‌లో పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్…
కరోనా ఎఫెక్ట్.. ఆమీర్‌పేట్‌లోని హాస్టళ్లు, కోచింగ్ సెంటర్ల మూసివేత…
రేపిస్టు భార్యగా ఉండలేను.. విడాకులు కావాలి..
ఐపీఎల్‌కు ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరం..!
కరోనా ప్రభావం.. ఐదు లక్షల రెస్టారెంట్లు బంద్…
ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కోర్సు ఫీజుల ఖరారు.!