రేపిస్టు భార్యగా ఉండలేను.. విడాకులు కావాలి..

 Nirbhaya Case: నిర్భయ దోషుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ భార్య పునీత విడాకులు కావాలంటూ మరో పిటిషన్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఫ్యామిలీ కోర్టులో ఆమె విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. అత్యాచారం కేసులో తన భర్తను దోషిగా తేల్చి అతనికి ఉరిశిక్ష విధించారని.. కానీ తన భర్త నిర్దోషి అని తెలిపింది పునీత. రేప్ కేసులో ఉరి తీసిన దోషి […]

రేపిస్టు భార్యగా ఉండలేను.. విడాకులు కావాలి..
Follow us

|

Updated on: Mar 18, 2020 | 2:22 PM

 Nirbhaya Case: నిర్భయ దోషుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ భార్య పునీత విడాకులు కావాలంటూ మరో పిటిషన్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఫ్యామిలీ కోర్టులో ఆమె విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. అత్యాచారం కేసులో తన భర్తను దోషిగా తేల్చి అతనికి ఉరిశిక్ష విధించారని.. కానీ తన భర్త నిర్దోషి అని తెలిపింది పునీత.

రేప్ కేసులో ఉరి తీసిన దోషి భార్యగా తాను ఉండాలనుకోవడం లేదంటూ ఆమె ఆ పిటిషన్‌లో పేర్కొంది. కాగా ఈ పిటిషన్ మార్చి 19న విచారణకు రాబోతోంది. ఇక ఆ మర్నాడే మార్చి 20న అక్షయ్ కుమార్ సింగ్‌ను ఉరి తీయనున్నారు.

అటు ఆమె తరపున న్యాయవాది కూడా మాట్లాడుతూ.. ఏ భార్య అయినా తన భర్త ఏదైనా కేసులో దోషిగా తేలితే విడాకులు తీసుకునేందుకు అర్హురాలని తెలిపారు. కాగా, ఇప్పటికే దోషుల్లో ముగ్గురు తమ కుటుంబాలను ఆఖరి చూపు చూసుకోగా.. అక్షయ్ కుమార్ సింగ్‌ను కూడా చూసుకోవచ్చునని అతని కుటుంబానికి జైలు అధికారులు లేఖ రాశారు.

For More News:

హైదరాబాద్‌లో పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్…

కరోనా ఎఫెక్ట్.. ఆమీర్‌పేట్‌లోని హాస్టళ్లు, కోచింగ్ సెంటర్ల మూసివేత…

ఐపీఎల్‌కు ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరం..!

కరోనా ప్రభావం.. ఐదు లక్షల రెస్టారెంట్లు బంద్…

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కోర్సు ఫీజుల ఖరారు.!

కరోనా వైరస్.. చైనా సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభావం తక్కువేనట..!

కరోనా వైరస్ ప్రభావం.. టీఎస్ సర్కార్ మరో కీలక నిర్ణయం..

గుడ్ న్యూస్.. ఎయిడ్స్ మందులతో కరోనా నయం.. సీఎం కంగ్రాట్స్..