వెంకన్న దర్శనానికి వెళ్లి….హైదరాబాద్ టెక్కీ సూసైడ్
తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి అని చెప్పి వెళ్లిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి అని చెప్పి వెళ్లిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంతకీ ఆ ఉద్యోగి ఎవరు..? అతడి ఆత్మహత్యకు గల కారణాలు ఏంటీ..? అన్నదానిపై ఆరా చేపట్టారు. వివరాల్లోకి వెళితే… అనంతపురం జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడికి భార్య, కుమారుడు ఉన్నారు. కాగా, గతేడాది నవంబర్‌లో తాను పనిచేస్తున్న సంస్థ తనను విధుల నుంచి తొలగించినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఏ ఉద్యోగం రాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల 14న తిరుపతి వెళ్తున్నానని హైదరాబాద్‌లో ఉంటున్న భార్యబిడ్డలకు చెప్పాడు. ముందుగానే ఆన్‌లైన్‌లో హోటల్‌లో గది బుక్ చేసుకున్నాడు.. ఏ హోటల్‌లో ఉంది కుటుంబసభ్యులకు చెప్పాడు. అక్కడకు వెళ్లిన తర్వాత హోటల్ గదిలోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో వారు ఎంతప్రయత్నించినా అతడి ఫోన్ కలవటం లేదు…సోమవారం మధ్యాహ్నం నుంచి ఫోన్ తీయకపోవడంతో హోటల్‌కు కుటుంబసభ్యులు ఫోన్ చేశారు. వారు వెళ్లి తలుపులు తట్టినా తెరవకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా.. ఫ్యాన్‌కు బెడ్‌షీట్ సహాయంతో ఉరివేసుకుని వేలాడుతున్న కనిపించాడు. మృతదేహాన్ని కిందకు దింపిన పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబసభ్యులు డెడ్‌బాడీని అంత్యక్రియల కోసం స్వగ్రామానికి తరలించారు. చేసుకున్నారు.