ఐపీఎల్‌కు ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరం..!

Coronavirus: కరోనా.. కరోనా.. కరోనా.. ఈ మహమ్మారి వైరస్ భారత్‌ను గజగజలాడిస్తోంది. ఇప్పటికే దాదాపు సగం రాష్ట్రాలు ఈ కోవిడ్ 19 వల్ల బంద్ కాగా.. మరికొన్ని రాష్ట్రాలు కూడా అదే బాట పడుతున్నాయి. అటు క్రీడారంగంపై కూడా కరోనా ప్రభావం తీవ్రంగా పడిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆస్ట్రేలియా ఆటగాళ్లు కరోనా కారణంగా […]

ఐపీఎల్‌కు ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరం..!
Follow us

|

Updated on: Mar 18, 2020 | 2:22 PM

Coronavirus: కరోనా.. కరోనా.. కరోనా.. ఈ మహమ్మారి వైరస్ భారత్‌ను గజగజలాడిస్తోంది. ఇప్పటికే దాదాపు సగం రాష్ట్రాలు ఈ కోవిడ్ 19 వల్ల బంద్ కాగా.. మరికొన్ని రాష్ట్రాలు కూడా అదే బాట పడుతున్నాయి. అటు క్రీడారంగంపై కూడా కరోనా ప్రభావం తీవ్రంగా పడిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆస్ట్రేలియా ఆటగాళ్లు కరోనా కారణంగా ఐపీఎల్ కాంట్రాక్టులను వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వారు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనితో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కమ్మిన్స్, ఆరోన్ ఫించ్, మాక్స్‌వెల్ తదితరులు ఐపీఎల్ 13వ సీజన్‌కు దూరం కానున్నారు. కాగా, క్రికెటర్లు వ్యక్తిగతంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని.. ఇందులో ఆసీస్ బోర్డు ప్రమేయం ఏమి లేదని తెలుస్తోంది. ఐపీఎల్ ఆడాలా.? వద్దా.? అనేది పూర్తిగా ప్లేయర్ల వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ వెల్లడించారు.

For More News:

హైదరాబాద్‌లో పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్…

కరోనా ఎఫెక్ట్.. ఆమీర్‌పేట్‌లోని హాస్టళ్లు, కోచింగ్ సెంటర్ల మూసివేత…

రేపిస్టు భార్యగా ఉండలేను.. విడాకులు కావాలి..

కరోనా ప్రభావం.. ఐదు లక్షల రెస్టారెంట్లు బంద్…

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కోర్సు ఫీజుల ఖరారు.!

కరోనా వైరస్.. చైనా సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభావం తక్కువేనట..!

కరోనా వైరస్ ప్రభావం.. టీఎస్ సర్కార్ మరో కీలక నిర్ణయం..

గుడ్ న్యూస్.. ఎయిడ్స్ మందులతో కరోనా నయం.. సీఎం కంగ్రాట్స్..