కరోనా ప్రభావం.. ఐదు లక్షల రెస్టారెంట్లు బంద్…

Coronavirus Scare: భారత్‌లో కరోనా పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఈ వైరస్ బారినపడ్డ వారి సంఖ్య 137కు చేరింది. దీనితో దాదాపు సగం రాష్ట్రాలు బంద్ పాటిస్తున్నాయి. ఇక మిగిలిన రాష్ట్రాలు కూడా అదే బాట పట్టేలా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఆర్ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తమ అధీనంలో ఉన్న 5 లక్షల రెస్టారెంట్లను మూసివేయాలని నిర్ణయించినట్లు అసోసియేషన్ వెల్లడించింది. ఒక్క […]

కరోనా ప్రభావం.. ఐదు లక్షల రెస్టారెంట్లు బంద్...
Ravi Kiran

|

Mar 18, 2020 | 2:21 PM

Coronavirus Scare: భారత్‌లో కరోనా పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఈ వైరస్ బారినపడ్డ వారి సంఖ్య 137కు చేరింది. దీనితో దాదాపు సగం రాష్ట్రాలు బంద్ పాటిస్తున్నాయి. ఇక మిగిలిన రాష్ట్రాలు కూడా అదే బాట పట్టేలా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఆర్ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తమ అధీనంలో ఉన్న 5 లక్షల రెస్టారెంట్లను మూసివేయాలని నిర్ణయించినట్లు అసోసియేషన్ వెల్లడించింది. ఒక్క రెస్టారెంట్లు మాత్రమే కాకుండా పబ్‌లు, బార్లు, కేఫ్‌లను ఇవాళ్టి నుంచి మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. అయితే రెస్టారెంట్లు ఖచ్చితంగా మూసివేయాలన్న నియమం ఏమి లేదని.. యాజమాన్యాల ఇష్టమని అసోసియేషన్ స్పష్టం చేసింది. కాగా, కరోనాను కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే మాల్స్, థియేటర్లు, బార్లు, విద్యాసంస్థలను మూసివేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఎన్‌ఆర్ఏఐ ఆదేశాలను పాటిస్తామని.. ఈ నెల 31 వరకు తమ ఔట్‌లెట్లను మూసివేస్తామని ఫస్ట్ ఫిడ్డిల్ రెస్టారెంట్ల ఎండీ ప్రియాంక తెలిపారు. అయితే డొమినోస్ మాత్రం తమ రెస్టారెంట్లను మూసివేయమని.. యధావిధిగా కొనసాగిస్తామని ప్రకటించింది. కాగా, కరోనా విజృంభణను అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ నెల 31 వరకు మాల్స్, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, కోచింగ్ సెంటర్లు మూసివేశారు.

For More News:

హైదరాబాద్‌లో పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్…

కరోనా ఎఫెక్ట్.. ఆమీర్‌పేట్‌లోని హాస్టళ్లు, కోచింగ్ సెంటర్ల మూసివేత…

రేపిస్టు భార్యగా ఉండలేను.. విడాకులు కావాలి..

ఐపీఎల్‌కు ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరం..!

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కోర్సు ఫీజుల ఖరారు.!

కరోనా వైరస్.. చైనా సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభావం తక్కువేనట..!

కరోనా వైరస్ ప్రభావం.. టీఎస్ సర్కార్ మరో కీలక నిర్ణయం..

గుడ్ న్యూస్.. ఎయిడ్స్ మందులతో కరోనా నయం.. సీఎం కంగ్రాట్స్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu